Trivikram: మీరు తప్పుకోండి

త్రివిక్రమ్ శ్రీనివాస్ అక్షరాలను అలవోకగా కాగితం మీద విసరగల సమర్ధుడు. మాటలతో ప్రేక్షకుడిని కట్టి పడేయగల దర్శకుడు.తీసినవి తక్కువే సినిమాలే అయినా వాటిలో 90% సినిమాలు స్టార్ హీరోస్ తో చేసినవే. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ కి మంచి సన్నిహిత్యం ఉంది.

పవన్ హీరోగా మూడు సినిమాలను చేసాడు త్రివిక్రమ్. అలానే మహేష్ హీరోగా ప్రస్తుతం మూడవ సినిమాను తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. కేవలం తన సినిమాల విషయంలో కాకుండా పవన్ సినిమాలు విషయంలో త్రివిక్రమ్ వేలు పెడుతుంటాడు అని ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ పవన్ సినిమాల విషయంలో ప్రస్తుతం త్రివిక్రమ్ పెన్ పెడుతున్నట్లు అందరికి తెలిసిన విషయం.

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత చేసిన రెండు సినిమాలు రీమేక్ ఫిలిమ్స్.మొదటి రీమేక్ వకీల్ సాబ్ స్టార్ట్ అవ్వడానికి కారణం కూడా త్రివిక్రమ్ అని చాలా కొద్దిమందికి తెలిసిన విషయం. ఈ సినిమా తరువాత హరి హర వీరమల్లు రిలీజ్ అవుతుంది అనుకునే తరుణంలో దానికి బ్రేక్ ఇచ్చి భీమ్లా నాయక్ ను సిద్ధం చేసాడు త్రివిక్రమ్, వాస్తవానికి దర్శకుడు శేఖర్ కె చంద్ర అయినా ఎక్కువ క్రెడిట్ త్రివిక్రమ్ కి వెళ్ళింది. డైలాగ్స్ కూడా అదే స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి.

- Advertisement -

ఇప్పుడు హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, ఓజి లాంటి స్ట్రైట్ ఫిలిమ్స్ వస్తాయి అనుకున్న తరుణంలో, మరో రీమేక్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అదే వినోదాయ సితం ఈ సినిమాను తమిళంలో సముద్రఖని తెరకెక్కించాడు. తెలుగులో సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ , సాయి తేజ్ ఈ సినిమాలో నటించబోతున్నారు.

తెలుగు వెర్షన్ ను డిఫెరెంట్ గా రాసాడు సముద్రఖని, కానీ అంతగా అది సంతృప్తిని ఇవ్వకపోవడంతో, సాయి మాధవ్ బుర్రతో మరో వెర్షన్ రాయించారు అది అంతగా ఎక్కకపోవడంతో, ఈసారి త్రివిక్రమ్ రంగంలోకి దిగి మరో కొత్త వెర్షన్ ను రెడీ చేసాడు ఆ వెర్షన్ నే ఫైనల్ చేసి పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అందరికి లైన్ క్లియర్ చేసి ఇలా త్రివిక్రమ్ కొన్ని ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకెళ్లడం కొందరికి జీర్ణించుకోలేని విషయంలా అనిపిస్తుంది.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు