Bigboss7: ఆ తప్పు వల్లే ఉదయభాను కెరీర్ నాశనమైందా..!

గతంలో టాలీవుడ్ బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ గల గలా మాట్లాడుతూ అందరినీ ఫిదా చేసిన ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో యాంకరింగ్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఉదయభాను భారీగా అభిమానులను కూడా దక్కించుకుంది.

ప్రస్తుతం యాంకర్ సుమ ఎంత బిజీగా ఉంటుందో, ఎంత పారితోషకం తీసుకుంటుందో అంత బిజీగా ఉండేది ఉదయభాను. బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. ఎర్రసైన్యం సినిమాతో మొదటిసారి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలు సినిమాలలో కొన్ని పాత్రలలో నటించింది. అంతేకాదు స్పెషల్ సాంగ్ లలో కూడా మెప్పించింది. సాహసం చేయరా డింభక, రేలారే రేలా, వన్స్ మోర్ ప్లీజ్, డాన్స్ బేబీ డాన్స్ వంటి ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరించింది.

అయితే కెరీర్ సాఫీగా సాగుతుందనుకున్న సమయంలోనే అనూహ్యంగా ఆమె జీవితంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలాగే ఆమె పెళ్లి ఓ మిస్టరీగా జనాలలో మిగిలిపోయింది. ఈమెకి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే 15వ ఏటా ఓ ముస్లిం వ్యక్తితో పెళ్లి జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అతని నుండి విడిపోయింది. ఇక ఇండస్ట్రీ లోకి వచ్చి కెరీర్ హ్యాపీగా సాగుతున్న సమయంలో 2004లో విజయ్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమె కారు డ్రైవర్ గా ఉండేవారట. ఇదే కాకుండా ఆమె వివాహం చేసుకున్న సమయంలో ఆమెపై ఎన్నో వివాదాలు కూడా వచ్చాయి. దీంతో ఆమె అప్పటివరకు సంపాదించుకున్న క్రేజ్ మొత్తం పోయింది.

- Advertisement -

అయితే వీరి పెళ్లికి ఉదయభాను తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. కానీ ఆమె తను ప్రేమించిన వాడి కోసం ఇంటి నుండి బయటకు వచ్చి మరీ ఆ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు తెలిపారు. ఇలా ఎఫైర్, ప్రేమ, పెళ్లి వల్లే బుల్లితెరపై రాణించలేకపోయింది ఉదయభాను. దాని ఫలితంగానే ఆమెకు వచ్చే అవకాశాలు కూడా కోల్పోయిందట. ఇక ప్రస్తుతం ఇద్దరు ఆడ కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉదయభాను వారి ఆలన చూసుకుంటూ ఇంటికే పరిమితమైంది. ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు