Unstoppable: తొక్కినేని ఎఫక్ట్

నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం సక్సెస్ మీట్ తాజాగా జరిగింది. అయితే ఈ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్, ఇరు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారాయి.

ఆదివారం రాత్రి జరిగిన ఈ సక్సెస్ మీట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ.. ” ఈయన ఉన్నాడంటే ఎప్పుడూ కూర్చుని శాస్త్రాలు.. నాన్నగారు.. డైలాగులు.. ఆ రంగారావు.. ఈ అక్కినేని తొక్కినేని.. అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం” అని అన్నారు బాలకృష్ణ.

ఈ వ్యాఖ్యలు అక్కినేని అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి.సోషల్ మీడియాలో బాలయ్య పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఈ నేపథ్యంలో బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య, అఖిల్ అక్కినేని స్పందించారు.

- Advertisement -

“నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామ్మతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనమే కించపరచుకోవడం”అంటూ ట్వీట్ చేశారు.అయితే బాలకృష్ణ “ఆన్ స్టాపబుల్ విత్ ఎన్బికె” అనే ప్రోగ్రాం ని చేస్తున్న విషయం తెలిసిందే.ఈ షో షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరుగుతుంది.ప్రస్తుతం రెండవ సీజన్ చివరి దశలో ఉన్న నేపథ్యంలో రేపు ఓ విశిష్ట అతిథితో బాలయ్య ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది.

ఈ నేపథ్యంలో బాలయ్య కి షాక్ ఇచ్చింది అన్నపూర్ణ స్టూడియోస్.”We won’t allow Balakrishna in to studios” అని అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఆహా టీం కి మెసేజ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది.అంటే బాలకృష్ణని అన్నపూర్ణ స్టూడియోస్ లోకి అనుమతించమని అన్నపూర్ణ స్టూడియోస్ స్పష్టం చేసింది.దీంతో “అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె” షూటింగ్ ని ఆహ పోస్ట్ పోన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు