Upasana: పిల్లల కోసం 20 ఏళ్లు త్యాగం చేయాలి

చిరుత సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తనయుడుగా నిరూపించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ప్రస్తుతం రామ్ చరణ్ – శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం సగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇక రామ్ చరణ్ చిన్నప్పటి తన స్నేహితురాలు అయిన ఉపాసనని ప్రేమించి.. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఉపాసన ప్రముఖ వ్యాపారవేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు. ఉపాసన తల్లిదండ్రులు శోభ కామినేని, అనిల్ కామినేని.

అయితే వీరికి వివాహమైన 10 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ – ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఈ సందర్భంగా పిల్లల గురించి గతంలో ఉపాసన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఉపాసన ఏమన్నారంటే.. ” పిల్లలను కనడం అనేది 20 సంవత్సరాల ప్రాజెక్టు. మనం తల్లిదండ్రులు కావడానికి మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలి.

ఈ ప్రపంచంలోకి ఒక ప్రాణిని తీసుకురావడం అనేది అతి పెద్ద బాధ్యత. వారు పుట్టిన తర్వాత వారి గురించి అనేక విషయాల గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఇలా అన్ని విషయాల గురించి అవగాహన ఉన్నప్పుడే తల్లిదండ్రులు కావాలి ” అన్నారు ఉపాసన. ఇలా గతంలో ఉపాసన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు