Urfi Javed: నాకు దుస్తులు అంటే అలర్జీ

ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియా అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈమె బాగా తెలుసు. విభిన్నమైన, చిత్ర విచిత్రమైన డ్రెస్సులు ధరించి, అందాలు ప్రదర్శిస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం ఆశ్చర్యపరిచే బ్యూటీ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫి జావేద్ మాత్రమే. హిందీ బిగ్ బాస్ షో ద్వారా పాపులారీటీ సంపాదించిన ఈ నటి బోల్డ్ షో చేసేలా డ్రస్సులు వేసి హంగామా చేస్తూ.. బాలీవుడ్ వీదుల్లో హంగామా చేస్తూ ఉంటుంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత సినిమా ప్రపంచంలో నటిగా కొనసాగింది. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో కూడా తనదైన శైలిలో అడుగులు వేస్తోంది. ఇక సోషల్ మీడియాలో తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ మితిమీరిన బోల్ట్ నెస్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. అయినా సరే ఈ బోల్డ్ భామ మాత్రం ఎటువంటి విమర్శలను పట్టించుకోకుండా తనకి నచ్చినట్లు చేసుకుంటూ పోతుంది.

అయితే తాను ఇలా సగం సగం బట్టలు వేసుకోవడానికి కూడా ఓ రీజన్ ఉందంటూ చెప్పుకొచ్చింది ఉర్ఫి. తనకి ఉన్ని బట్టలు అంటే అలర్జీ అని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అంతేకాదు అలాంటి బట్టలు వేసుకుంటే తన శరీరంపై దద్దుర్లు వస్తాయని, అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ” నా చర్మానికి ఉన్ని బట్టలు అస్సలు పడవు. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే ఉన్ని దుస్తులు ధరిస్తే నాకు రాషెస్, దద్దుర్లు వస్తాయి. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. నిజం చెప్పాలంటే నాకు బట్టలు అంటేనే అలర్జీ. అందుకే నేను ఇలాంటి బట్టలు వేసుకుంటాను. కావాలంటే మీరే చూడండి.. నా చేతులు, కాళ్లపై దద్దుర్లు ఎలా వచ్చాయో”. అని ఈ మేరకు ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉర్ఫీ జావేద్.

For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు