Hit 2 : రొమాంటిక్ ఫీల్

శైలేష్ కొలను దర్శకత్వంలో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “హిట్” సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అంద‌రికీ తెలిసిందే. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ త్రిల్లర్ జోనర్ లో విశ్వక్ సేన్‌ నటించిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది.

డైరెక్టర్ శైలేష్ 2021 లో ఈ సినిమాకు సీక్వెల్ హిట్, ది సెకండ్ కేసును ప్రకటించాడు. అయితే మొదటి భాగంలో హీరోగా నటించిన విశ్వక్ సేన్‌ ను కాకుండా ఈ ఫ్రాంచైజ్ మూవీలో అడవి శేషు నటిస్తున్నాడు. దర్శకుడు శైలేష్ కోలను “హిట్ 2” ని సూపర్ హిట్ చేయాలని తపనతో స్క్రిప్ట్ ను తయారు చేశారు.ఇటీవల విడుదలైన టీజర్ సినిమా పై కొంత మేరకు అంచనాలు పెంచింది. అయితే అడల్ట్ కంటెంట్ ఉందనే కారణంతో యూట్యూబ్ ఈ టీజర్ ను ఆపేసింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి “ఉరికే ఉరికే” అనే రొమాంటిక్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటలో అడవిశేష్, మీనాక్షి చౌదరి మధ్య చక్కటి కెమిస్ట్రీ ని చూడవచ్చు. ప్రత్యేకించి బెడ్ రూమ్ సీన్స్, లిప్ లాక్స్ యూత్ ని ఆకట్టుకునేలా సాగాయి. చాలా రోజుల తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ చక్కటి మెలోడీతో రావటం గమనించవచ్చు. ఈ మెలోడీ కి గీత రచయిత కృష్ణ కాంత్ సాహిత్యాన్ని అందించగా, సిద్దు శ్రీరామ్ పాడారు ఈ ‘ఉరికే ఉరికే’ పాట వినగానే ఆకట్టుకునేలా ఉండటంతో త్వరగానే ట్రెండ్ లోకి వెళ్ళటం ఖాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు