Khushi: పవర్ స్టార్ సినిమా చూస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఖుషి” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ ని యూత్ కి దగ్గరకి చేసి ఒక స్టైలిష్ ఐకాన్ గా భారీ ఫాలోవర్స్ ని వచ్చేలా చేసింది. అంతే కాదు పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి టాలీవుడ్ లో పలు రికార్డులను తిరగరాసింది. ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కి ఆ రేంజ్ హిట్ రావడానికి పదేళ్లు పట్టింది. రీసెంట్ గా రీ రిలీజ్ అయిన ఖుషి ఇప్పుడు కూడా అదే రెస్పాన్స్ ని దక్కించుకుని భారీ వసూళ్లు సాధించింది. రీ రిలీజ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఖుషి రికార్డు క్రియేట్ చేసింది. అభిమానుల్లోనూ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇష్టమైన సినిమా అంటే ఖుషి ఏ ముందుంటుంది.

అయితే ఈ సినిమాను ఒక బాలీవుడ్ హీరోయిన్ చూస్తున్నా అంటూ ట్వీట్ పెట్టింది. ఆమె మరెవరో కాదు స్టార్ ఐటెం గర్ల్ ఊర్వశి రౌతేలా. తెలుగు లో వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా పాపులరైన ఈ హీరోయిన్ ఇప్పుడు రీసెంట్ గా అఖిల్ ఏజెంట్ లోను స్పెషల్ సాంగ్ చేసింది. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న “బ్రో” సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేయనుందని సమాచారం. మొన్నటి వరకు గాసిప్ గానే ప్రచారం అయిన న్యూస్ తాజాగా ఉర్వశి పెట్టిన న్యూస్ తో నిజమేనని అనిపిస్తుంది.

ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ నటించిన “ఖుషి” మూవీని చుస్తున్నానంటూ ఊర్వశి రౌతేలా ట్వీట్ పెట్టింది. ఈ ట్వీట్ తో పవర్ స్టార్ సినిమాలో స్పెషల్ సాంగ్ కన్ ఫర్మ్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక వాల్తేరు వీరయ్య లో అన్నయ్య తో కలిసి చిందేసిన ఊర్వశి ఇప్పుడు తమ్ముడితో కలిసి డాన్స్ చేయనుండడం విశేషం. ఇక బ్రో సినిమా ఇప్పటికే 90శాతం పూర్తయిపోగా త్వరలోనే టీజర్ విడుదల చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు