Ustaad Bhagat Singh: హరీష్ క్లారిటీ

గబ్బర్ సింగ్ సినిమా తర్వాత , పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా తమిళ్ లో హిట్ అయినా తేరీ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతుంది. హరీష్ శంకర్ రీమేక్ సినిమాలను తనదైన స్టైల్ లో మార్చడంలో దిట్ట అని చెప్పొచ్చు. అలానే ఇదివరకే చేసిన గబ్బర్ సింగ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

మరోసారి వీరి కలయికలో తేరి రీమేక్ కంటే ముందు భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను చెయ్యాలి, కానీ అనుకోని కారణంగా ఆ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ గా రూపుదిద్దుకోబోతుంది. రీమేక్ సినిమాకు మేజర్ మార్పులు హరీష్ శంకర్ చేస్తాడు కాబట్టి, ఈ సినిమాకి కూడా భారీగా మార్పులు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వీటన్నిటికీ స్వయంగా హరీష్ శంకర్ స్పందించాడు. ఈ వార్తల్లో అయితే ఎలాంటి నిజం లేదని హరీష్ ఖండించాడు.ఇకపోతే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే. అందుకే ఫ్యాన్స్ లో వీరి కాంబో లో వచ్చే సినిమా పై అంచనాలు బాగా ఎక్కువగా ఉన్నాయి

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు