Ustaad Bhagat Singh: పాపం పూజా పరిస్థితి ఏంటి ?

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. ఈమెకు ఐరెన్ లెగ్ అనే పేరున్నా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఒక టాలీవుడ్ లోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీలోనూ అగ్ర హీరోల సరసన ఈ బుట్టబొమ్మ నటించింది. బాలీవుడ్ లోనూ ఈ పూజాకు తిరుగులేదు. మొదటి సినిమానే హృతిక్ రోషన్‌తో నటించింది. ఈ మూవీ ఫలితం దారుణంగానే ఉన్నా.. ఈమె మళ్లీ బాలీవుడ్ లో ఛాన్స్ లు రావడానికి ఎంతో సమయం పట్టలేదు.

కొన్ని ఏళ్ల పాటు పూజా హెగ్డే కెరీర్ సాఫీగానే సాగింది. ఫ్లాప్ లు వచ్చినా, కెరీర్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, ఈ మధ్య కాలంలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈమె ఏ సినిమా చేసిన డిజాస్టార్ టాక్ వస్తోంది. టాలీవుడ్ రాధేశ్యామ్, కోలీవుడ్ లో బీస్ట్, బాలీవుడ్ లో సర్కస్ సినిమాలు వరుసగా డిజాస్టార్ అయ్యాయి. ఇది పూజా కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించింది.

ఈ సినిమాల తర్వాత పూజా పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. బాలీవుడ్ లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ చేస్తుంది. టాలీవుడ్ లో SSMB28 చేస్తోంది. ఈ రెండు సినిమాలకు సైన్ చేసి చాలా రోజులు అవుతుంది. వీటి తర్వాత ఈ బుట్టబొమ్మ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ లేదు. మధ్య లో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో పూజాను తీసుకున్నట్టు టాక్ వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పూజా పేరు సిఫార్స్ చేశాడని టాక్ వినిపించింది.

- Advertisement -

దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ లో పూజా దాదాపు ఖాయమని అనుకున్నారు. కానీ, మొదట ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వచ్చింది. అప్పుడు పూజాను తప్పించారని అందరు అనుకున్నారు. కానీ, సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అని, అందులో ఒకరు పూజా హెగ్డే, మరోకరు శ్రీలీల అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ లో సెకండ్ హీరోయిన్ గా మాళవిక మోహనన్ ను ఫిక్స్ చేసినట్టు గుస గుసలు వినిపించాయి.

అయితే మాళవిక దీనిపై స్పందించి, తాను ఉస్తాద్ లో నటించడం లేదని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఇదిలా ఉండగా, మేకర్స్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నారు అనేది మాత్రం స్పష్టమవుతుంది. అంటే పూజా హెగ్డేను ఈ సినిమాలో ఉండటం లేదని కూడా కన్ఫామ్ అవుతుంది. దీంతో పూజాకి SSMB28 తరువాత ఇంక ఏ ప్రాజెక్టులు చేతిలో లేదనే చెప్పొచ్చు. దీంతో ప్రస్తుతం పూజా పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు