Varalakshmi Sarathkumar: అప్పుడు క్రాక్.. ఇప్పుడు వీర సింహా రెడ్డి

ప్రముఖ కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి తెలియని వారుండరు. కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ, సౌత్ లో దాదాపు అన్ని భాష చిత్రాల్లో కనిపిస్తోంది. తెలుగులో ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితురాలు. టాలీవుడ్ లో ఇటీవల పక్కా కమర్షియల్ లో అతిథి పాత్రలో మెరిసిన వరలక్ష్మీ శరత్ కుమార్.. సమంత యశోద సినిమాలో ప్రతినాయకురాలు పాత్ర చేసి మెప్పించింది.

అయితే తెలుగులో ఈమెకు మంచి పేరు తెచ్చింది మాత్రం జయమ్మ పాత్ర. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర చేసింది వరలక్ష్మీ శరత్ కుమార్. అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులు ఈమెను జయమ్మ అనే పిలుస్తున్నారు. అంతటి గుర్తింపు తెచ్చింది ఆ పాత్ర. అయితే తనకు తెలుగులో అంతటి గుర్తింపు తెచ్చిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహా రెడ్డిలో ఈ జయమ్మ కీలక పాత్ర చేస్తున్న సంగతి విధితమే.

ఈ చిత్రంలో పద్మ అనే పాత్రలో వరలక్ష్మీ కనిపించబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ని చూస్తే.. పద్మ పాత్ర జయమ్మ పాత్రలాగే పవర్ ఫుల్ విలన్ గా ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఈ చిత్రంలో ఆమె కట్టు బొట్టు ప్రతి నాయకురాలిగా సూపర్ గా సెట్ అయిందని ఇప్పటికే కామెంట్స్ వస్తున్నాయి. జయమ్మ పాత్ర లాగే పద్మ పాత్ర కూడా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

జయమ్మ పాత్ర లాగే.. పద్మ పాత్ర కూడా సక్సెస్ అయితే వరలక్ష్మీ శరత్ కుమార్ కు తెలుగులో మరిన్నీ విలన్ పాత్రలు వచ్చే అవకాశం ఉంది. అలాగే లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మీ శరత్ కుమార్ దర్శకులకు మొదటి ఎంపిక అవుతుందని ఖచ్చితంగా చెప్పగలం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు