Varisu : తన మార్క్ డ్యాన్స్ తో..

విజయ్ దళపతి నుంచి వస్తున్న తాజా సినిమా వరిసు. దీన్ని తెలుగులో ‘వారసుడు’ అనే పేరుతో డబ్బింగ్  చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ముందుగా తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి తెరకెక్కిస్తున్నట్టు, ద్విభాష చిత్రంగా ప్రకటించారు. కానీ తర్వాత వారిసు పూర్తిగా తమిళ సినిమా అని, దీన్ని తెలుగులో డబ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తమిళ్ లో “వరిసు” గా విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థ‌మన్ సంగీతం అందిస్తున్నారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ఖుష్భు, స్నేహ, యోగి బాబు, సీనియర్ నటి జయసుధ ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ తుది దశ షూటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో మేకర్స్ సినిమాపై క్రేజీగా అప్‌డేట్స్ అందిస్తున్నారు. ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ” రంజితమే” ప్రోమోను విడుదల చేశారు. తమిళ వెర్శన్ రంజితమే సాంగ్ ప్రోమోను లాంచ్ చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే మరోసారి విజయ్ ద‌ళ‌ప‌తి తన స్టెప్పులతో అదరగొట్టినట్టుగానే కనిపిస్తుంది. ఈ పూర్తి పాటను నవంబర్ 5న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది చిత్రం బృందం. ఈ అప్డేట్ తో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు. ప్రోమో చూస్తుంటే ఈ సాంగ్ సూప‌ర్ హిట్ కావ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఈ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం న‌వంబ‌ర్ 05 వ‌ర‌కు ఎదురు చూడాల్సిందే.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు