Varisu : కోలీవుడ్ సంక్రాంతి విన్నర్ ?

సంక్రాతి పండుగకి తెలుగు రాష్ట్రలో హడావుడి అంత సినిమా థియేటర్స్ దెగ్గరే కనిపించింది. టాలీవుడ్ నుంచి మెగా స్టార్ “వాల్తేరు వీరయ్య” తో పాటు బాలయ్య నటించిన “వీర సింహా రెడ్డి” రిలీజ్ అయి మంచి విజయాలని అందుకున్నాయి. “వీర సింహ రెడ్డి” తో బాలకృష్ణ కొంచం నిరాశ పరిచినా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్నాడు. ఇక వాల్తేరు వీరయ్య లో చిరంజీవి తన వింటేజ్ లుక్ తో మళ్ళీ ఫాంలోకి వచ్చారు. ఈ సినిమా ప్రస్తుతం సంక్రాంతి విన్నర్ గా దూసుకెళ్తుంది.

ఇక కోలీవుడ్ విషయానికి వస్తే “వారిసు” సినిమాతో విజయ్, “తూనీవు” సినిమాతో అజిత్ తలపడ్డారు. తూనీవు ఇటు తెలుగులో, అటు తమిళంలో యావరేజ్ టాక్ ను తెచ్చుకుంది. కానీ, మంచి వసూళ్లను రాబడుతుంది. ఇక తలపతి విజయ్ నటించిన వారిసు తెలుగులో మిశ్రమ టాక్ అందుకుంది. కానీ తమిళంలో మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ చిత్రం కలెక్షన్ల పరంగా రికార్డులను క్రియేట్ చేస్తోంది. వారీసు విడుదలైన 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసింది. థియేట్రికల్ రన్ ఇంకా ఉంది. కాబట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రం విజయ్ తలపతి క్రేజ్ ను మరింత పెంచింది.

- Advertisement -

సినిమా విడుదలకు ముందు నుంచి ఎదో ఒక విధంగా ప్రతిరోజూ ట్రేండింగ్ లో నిలిచింది. సినిమాచాలా సార్లు వాయిదా అయినప్పటికి కలెక్షన్ పరంగా ఎలాంటి ప్రభావం చూపలేదు. అలాగే దిల్ రాజు, రష్మిక మందన్న పై వచ్చిన ట్రోల్స్, నెగిటివ్ వార్తలు కూడా ఈ చిత్రం పై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేదు. మంచి ఫ్యామిలీ డ్రామా ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి తన స్క్రిప్ట్‌తో కోలీవుడ లో మంచి విజయాన్ని అందుకున్నాడు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు