Varun Tej: వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ

కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇటీవల వరుణ్ నటించిన గని అనే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక వరుణ్ తేజ్ 13వ సినిమాకు సంబంధించిన మూవీ షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్ గా కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రీసైనెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాకి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.

ఈయనకి ఇది మొదటి సినిమా. అయితే ఈ చిత్రాన్ని బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ ఆర్మీ చేతికి చిక్కిన తర్వాత మళ్లీ భారత్ తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో ఈ చిత్రాన్ని రిపొందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందించి 2023 వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో కథానాయికగా హిందీ నటి, మాజీ అందాల పోటీ విజేత మానుషి చిల్లార్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు