Venky75 : గ్లింప్స్ వచ్చేస్తోంది

విక్టరీ వెంకటేష్ కి తన సొంత పేరు కన్నా వెంకీ మామ అనే పేరుతోనే మరింత క్రేజ్ ఉంది. దృశ్యం, దృశ్యం 2 సినిమాలతో మంచి హిట్ అందుకున్నారు వెంకీ మామ. ఈ స్టార్ హీరో నుంచి ఇటీవల వచ్చిన F3 సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. కానీ, ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. ఇదిలా ఉండగా, వెంకీ మామ ప్రస్తుతం రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను నెట్‌ఫ్లిక్స్ OTT సంస్థ భారీ ఎత్తులో నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా, విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలనుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నేటి యంగ్ డైరెక్టర్స్ లో తక్కువ కాలంలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు శైలేష్ కొలను. హిట్ యూనివర్స్ లో సినిమాలు తీస్తూ వరుసగా మంచి విజయాలని అందుకున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా మేకర్స్ కు మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. అలాంటి డైరెక్టర్ తో వెంకటేష్ సినిమా చేస్తున్నాడు.

Venky75 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా పోస్టర్ ను ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను మేకర్స్ ఇచ్చాడు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను జనవరి 25న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం Filmify వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు