Vignesh : AK62 సినిమా ఆగిపోటానికి కారణం అదే..

తమిళ ప్రేక్షకులు ప్రేమగా తళ అని పిలుచుకునే అజిత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు, ఈ హీరో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో కూడా స్థానం సంపాదించుకున్నారు. అయితే ఈ హీరో తదుపరి సినిమా తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివం దర్శకత్వంలో నటించనున్నారని వినిపించిన విషయం తెలిసిందే.

అయితే విగ్నేష్ అజిత్ సినిమా ఆగిపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. విగ్నేష్ చెప్పిన కథ అజిత్ కు నచ్చలేదు అని, అసలు విగ్నేష్ చెప్పిన కథను అజిత్ పూర్తిగా వినలేదు అని, దీనితో విగ్నేష్ భార్య అయిన లేడీ సూపర్ స్టార్ నాయన తార కూడా అజిత్ ని ఒప్పించే ప్రయత్నం చేసినా కూడా అజిత్ ఒప్పుకోలేదు అని, దీనితో నయనతార ఇక మీదట అజిత్ తో నటించబోయేది లేదు అని నిర్ణయించేసుకుందని, పలు వార్తలు సినీ పరిశ్రమ లో చెక్కర్లు కొట్టాయి. కానీ ఈ జంట వీటి గురించి ఎప్పుడు స్పందించలేదు. అయితే ఆఖరికి ఈ సినిమా మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

అయితే ఈ వార్తల గురించి తాజాగా దర్శకుడు విగ్నేష్ శివన్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేసారు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ, అజిత్62 ఆగిపోవటానికి అజిత్ కారణం కాదు, నిజానికి అజిత్ తో మాకు ఎలాంటి వివాదాలు లేవు. ఈ కథలోని రెండవ భాగం నిర్మాత ని ఆకట్టుకోలేదు, అందుకే ఈ సినిమా ఆగిపోయింది. నాకు ఆయనంటే ఇప్పటికి ఓ అభిమానిలా ఎంతో ఇష్టం. ఇప్పుడు ఈ అవకాశం మగిజ్ తిరుమేని కి రావటం సంతోషం. ఈ సినిమాని ఓ అభిమాని స్థానం నుంచి థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తాను” అని చెప్పారు. దీనితో ఈ వార్తలన్నిటిని కొట్టి పారేశారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు