Vijay : మళ్లీ అదరకొడతాడా ?

మనందరికీ ఒక అభిమాన హీరో ఉంటాడు. ఆ హీరో సినిమాలు ఎన్ని వచ్చినా, ఎన్ని సార్లు వచ్చినా విసుగు రాదు. ప్రేక్షకులను ఉర్రూతలూగించి, ఈలలు వేయించిన సినిమాలు ఎన్ని ఉన్నా, అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నవి కొన్ని ఉన్నాయి. అలాంటి సినిమాలను వారి పుట్టినరోజుల సందర్భంగా మళ్లీ థియేటర్‌లో విడుదల చేస్తున్నారు. మహేష్ బాబు మాస్ బ్లాక్ బస్టర్ ‘పోకిరి’తో ప్రారంభమై పవన్ కళ్యాణ్ ‘జల్సా’ మరియు ‘తమ్ముడు’ అతని పుట్టినరోజు సందర్బంగా థియేటర్‌లో రీ-రిలీజ్ చేసి ట్రెండ్‌ను ముందుకు తీసుకెళ్లారు.

టాలీవుడ్ బాటలోనే కోలీవుడ్ కూడా నడుస్తుంది. రజనీ కాంత్ 20 ఏళ్ల క్రితం నటించిన ‘బాబా’ చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ స్టార్ 72వ పుట్టినరోజున పెద్ద తెరపైకి రాబోతున్న ఈ చిత్రం యొక్క కొత్త వెర్షన్ కోసం నటుడు ఇటీవల డబ్బింగ్ చెప్పాడని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వస్తే 90ల నాటి పిల్లలకు మాత్రమే కాదు, కొత్త తరానికి కూడా చూడదగ్గ ట్రీట్ అవుతుంది!

అంతే కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి కూడా అదే బాటలో నడుస్తూ తాను హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘నాళాయ తీర్పు’ చిత్రం డిసెంబర్ 4కి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా విజయ్ సూపర్ హిట్ సినిమాలలో ఒకటైన ‘అదిరింది’ సినిమా స్పెషల్ షోను డిసెంబర్ 4న సుదర్శన్ 35 ఏం ఏం థియేటర్ లో ప్రదర్శించనున్నారు. ఇది విజయ్ అభిమానులకి ఆనందం కలిగించే విషయం

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు