Vijay Antony: నేటి నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నాను

తమిళ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించి, హీరో గా మారి అనేక సినిమాల్లో నటించిన విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా బిచ్చగాడు సినిమాకు సీక్వల్ గా ‘బిచ్చగాడు 2′ సినిమా సెట్స్ పైకి వచ్చింది.

అప్పటినుంచి అయన కండిషన్ ఫ్యాన్స్ ను చాల ఆందోళనకు గురి చేసింది. అయితే గత వారంలో ఆయన తన గాయాలనుంచి కోలుకున్నారని, త్వరలోనే ఫ్యాన్స్ తో మాట్లాడతాను అని తానే స్వయంగా ట్వీట్ చేసారు.

ఇది ఇలా ఉండగా, తన ఆరోగ్య పరిస్థితిపై విజయ్ ఆంటోని మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ”నేను 90 శాతం కోలుకున్నాను. నా విరిగిన దవడ మరియు ముక్కు ఎముకలు కలిసిపోయాయి.
నేను గతంలో కంటే ఇప్పుడు మీతో సంతోషంగా ఉన్నాను 😊
ఏప్రిల్‌లో విడుదల కానున్న బిచ్చగాడు 2 షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభిస్తాను. మీరందరి ప్రేమ, ప్రార్థనలకు నా కృతజ్ఞతలు”. అంటూ తన ఫ్యాన్స్ ని ఉద్దేసింది ఓ ఎమోషనల్ ట్వీట్ చేసారు విజయ్ ఆంటోనీ.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు