Vijay: కీర్తి సురేష్ వల్ల విడిపోతున్న దళపతి దంపతులు.?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తన భార్య సంగీతతో విడిపోతున్నారని, త్వరలోనే వీళ్లు డైవర్స్ తీసుకుంటున్నారని గత కొద్ది రోజుల నుంచి తెగ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా.. సంగీత కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. సాధారణంగా విజయ్ తో అన్ని పార్టీలకు అటెండ్ అయ్యే సంగీత చాలా రోజుల నుంచి విజయ్ తో కనిపించడం లేదు. వరిసు ఈవెంట్ కు రాలేదు. అలాగే కోలీవుడ్ లో ఓ డైరెక్టర్ తన ఇంట్లో ఓ పార్టీ చేసుకున్నాడు. దీనికి విజయ్ ఒక్కడే వెళ్లాడు.

అప్పటి నుంచి దళపతి, సంగీత విడిపోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ట్విట్టర్ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. #JusticeForSangeetha నెటిజన్లు తెగ ట్వీట్స్ చేస్తున్నారు. 22 ఏళ్ల పాటు అన్యోన్యంగా సాగిన ఈ జంటను మహానటి కీర్తి సురేష్ విడగోడుతుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా గత కొన్ని రోజుల నుంచి కీర్తి సురేష్, విజయ్ దళపతి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందని కోలీవుడ్ కోడై కూస్తున్న సంగతి విధితమే.

కీర్తి సురేష్, విజయ్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు భైరవ, సర్కార్ సినిమాలు వచ్చాయి. అప్పటి నుంచి వీరి మధ్య పరిచయం ఉంది. అయితే ఈ పరిచయం ప్రస్తుతం ప్రేమగా మారిందని, అది డేటింగ్ వరకు దారి తీసిందని తెలుస్తుంది. కీర్తి సురేష్, విజయ్ డేటింగ్ లో ఉండటం వల్లే సంగీత తన పిల్లలతో అమెరికా వెళ్లిందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై విజయ్ కానీ, సంగీత కానీ, కీర్తి సురేష్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. మరి 48 ఏళ్ల విజయ్, 30 ఏళ్ల కీర్తి సురేష్ నిజంగా డేటింగ్ లో ఉన్నారా? వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారా ? అనేదానికి కాలమే సమాధానం చెబుతుంది.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు