Vijay Deverakonda: రష్మికతో బ్రేకప్, సమంతతో ప్రేమాయణం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రిలేషన్ షిప్ లో ఉంటున్నారు అంటూ చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి విధితమే. వీరిద్దరు కలిసి చాలా సార్లు వెకేషన్ కు వెళ్లారని, రూమర్స్ వచ్చాయి. కొన్ని సందర్భాల్లో వారి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఎప్పటికప్పుడు స్పందించి, ఈ వార్తలను కొట్టిపడేసినా.. వీరి రిలేషన్ షిప్ పై రూమర్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.

తాజాగా విజయ్ దేవరకొండ.. నేషనల్ క్రష్ కు బ్రేకప్ చెప్పాడట. అంతే కాదు మరో స్టార్ హీరోయిన్ తో చట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నాడట. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. వరుస హిట్స్ ఫుల్ ఫామ్ లో ఉన్న సమంత. విజయ్, సామ్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ విషయాన్ని దుబాయ్ సెన్సర్ బోర్డ్ మెంబర్ ఉమర్ సంధు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

ఖుషి సినిమా సెట్ లో వీరి ప్రేమ పుట్టిందని, ప్రస్తుతం ఖుషి షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుందని, అక్కడ సామ్, విజయ్ ఒకే రూంలో ఉంటున్నారని ట్వీట్ చేశాడు. అయితే ఈ న్యూస్ సమంత, విజయ్ దేవరకొండ, రష్మిక అభిమానులు ఖండిస్తున్నారు. అలాగే ఈ ట్వీట్ వేసిన ఉమర్ సంధుపై సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఇలాంటి రూమర్స్ ను క్రియేట్ చేయడం సరికాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల ఉమర్ సంధు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెళ్లీలపై, హీరోయిన్లతో సంబంధలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు