Vijay : జాతిరత్నం కోసం..

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రిన్స్. దీపావళి కానుకగా ఈ సినిమా అక్టోబర్ 21న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఇక ఈ చిత్రానికి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పాటలు, ఫస్ట్ గ్లింప్స్, టీజర్, ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పాలి. 

తెలుగు, తమిళం రెండు భాషల్లో ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. రిలీజ్ కి ముందు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ప్రిన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుందని  ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది చిత్ర యూనిట్. 

అక్టోబర్ 18, 2022 సాయంత్రం 6 గంటల నుంచి జరుగుతుంది. మంగళవారం జరిగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా యంగ్ హీరో విజయ్ దేవరకొండ విచ్చేయనున్నారు. ఇక ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో శివ కార్తికేయన్ సరసన హీరోయిన్ గా  ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క నటిస్తోంది.  ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం అక్టోబర్ 21న వరకు వేచి చూడాల్సిందే. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు