Vijay Deverakonda : వారిలో నేను ఉంటాను

విజయ్ దేవరకొండ.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ సమయంలోనే తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ, అతి తక్కువ సమయంలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈ రౌడీ హీరో, అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా గుర్తింపుని సంపాదించుకున్నారు. ఇటీవల ఈయన నుంచి వచ్చిన లైగర్ సినిమాపై దారుణంగా నిరాశపరిచింది. దీని తర్వాత సినిమాలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు.

ఇదిలా ఉండగా ఈ రౌడీ బాయ్ సినిమాలతో వినోదాన్ని పంచడమే కాదు.. సామాజిక సేవలో కూడా ఎప్పుడూ ముందుంటాడని తెలిసిందే. తాజాగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో చిన్నారులలో కాలేయ మార్పిడి అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ తో పాటు మలావత్ పూర్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం ఆర్గాన్ డొనేషన్ అంశంపై ప్రసంగించిన విజయ్ దేవరకొండ అవయవ దానం పై కీలక ప్రకటన చేశాడు.

తాను కూడా అవయవదానం చేస్తానని చెప్పుకొచ్చాడు. తాను జీవించినంత కాలం అవయవాలను జాగ్రత్తగా కాపాడుకుంటానని తెలిపారు. అవయవాలు ఎంతో విలువైనవి అని, వాటిని మట్టిపాలు చేయడం కంటే మరొకరికి దానం చేయడం ద్వారా వారికి ఆయుష్షు పోసిన వాళ్ళం అవుతామని వివరించారు. “నా తర్వాత నా ఆర్గాన్స్ వల్ల ఎవరో ఒకరు జీవించడం, వారిలో నేను కూడా ఉండడం అనేది చాలా గొప్ప విషయం” అని చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు