Vijay-Rashmika : మళ్లీ దొరికిపోయారు

టాలీవుడ్ నటీ నటుల మధ్య లవ్ ఎఫైర్స్ ఉండటం, అలాంటి రూమర్స్ రావడం కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు ఇలాంటి వార్తలు చాలా వచ్చాయి. అందులో కొన్ని నిజమయ్యాయి. మరి కొన్ని పుకార్లు గానే మిగిలిపోయాయి. కానీ చాలా రోజుల నుంచి ఒక జంట గురించి తెగ వార్తలు వస్తున్నాయి. ఆ జంట వీటిని ఖండించినా వార్తల ప్రవాహం ఆగడం లేదు. ఆ జంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.

విజయ్ దేవరకొండ, రష్మక మందన్నా కలిసి మొదటి సారి గీత గోవిందం లో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీని తర్వాత డియర్ కామ్రెడ్ లో రొమాన్స్ చేశారు. ఈ రెండు సినిమాల్లో విజయ్, రష్మిక మధ్య కెమీస్ట్రీ బాగా కుదిరింది. నిజమైన లవర్స్ లాగే ఈ సినిమాలు చేశారు. ఇది ఇలా ఉండగా చాలా రోజుల నుంచి విజయ్, రష్మిక మధ్య ఎదో ఉంది అని ప్రచారం సాగుతుంది. దీనిపై వీళ్లు స్పందించి.. అలాంటిదేమీ లేదని చెబుతున్నా.. వార్తలు ఆగడం లేదు.

ఇటీవల ఈ జంట మాల్దీవులకు వెళ్లారని, ఒకే ప్లేస్ లో ఉన్నారని ఫోటోలతో సహా వార్తలు వచ్చిన సంగతి విధితమే. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ విజయ్, రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలతో ఈ జంట మరోసారి నెటిజన్లుకు దొరికిపోయింది. వీళ్లు షేర్ చేసిన ఫోటోల్లో బ్యాగ్రౌండ్ ఒకటిగానే ఉంది. ఇంకా క్లారిటీగా వీళ్లు ఒకే ప్లేస్ కి వెళ్లారని పాత ఫోటోలను కూడా నెటిజన్లు షేర్ చేస్తున్నారు.

- Advertisement -

న్యూ ఇయర్ కి విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటోలో ఉన్న బ్యాగ్రౌండ్, ఇటీవల రష్మిక మల్దీవులకు వెళ్లినప్పుడు షేర్ చేసిన ఫోటోలో ఉన్న బ్యాగ్రౌండ్ ఒకటే. ఈ రెండు ఫోటోలను కంపేర్ చేస్తూ విజయ్, రష్మిక మధ్య లవ్ ఎఫైర్ ఉందని నెటిజన్లు మరోసారి కన్ఫామ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి వార్తలను ఖండించిన విజయ్, రష్మిక.. ఈ వార్తలపై ఇప్పుడు ఎలా స్పందింస్తారో వేచి చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు