Vijay Sethupathi: నేను పాన్ ఇండియా స్టార్ కాదు

విజయ్ సేతుపతి… ఈ పేరు తెలియని వారు ఉండరు. తమిళ్ లో పాపులర్ అయిన ఈ నటుడు… ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. ఆ సినిమాలో విలన్ గా చేసిన విజయ్ సేతుపతి… తెలుగులోనూ తన మార్కెట్ ను పెంచుకున్నాడు. హీరోగా, విలన్ గా కనిపించి, ప్రస్తుతం తన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఈ విలక్షణ నటుడు బాలీవుడ్ లో ఫర్జీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.

ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల పదో తారీఖు నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ తరుణంలో విజయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అతన్ని పాన్ ఇండియా స్టార్ గా యాంకర్ అభివర్ణించింది. దీంతో తనని అలా పిలవడంపై విజయ్ సేతుపతి అసహనానికి గురయ్యాడు. తనను పాన్ ఇండియా నటుడు అని పిలవకూడదు అని… నేను కేవలం నటుడిని మాత్రమే అని విజయ్ చెప్పుకొచ్చాడు. పాన్ ఇండియా స్టేట్మెంట్ తో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందని… కొన్నిసార్లు ఆ మాట ఒత్తిడికి కూడా గురి చేస్తుందన్నాడు.

అన్ని భాషల్లో సినిమాలు చేయాలని ఉందని… బెంగాలీ మరియు గుజరాత్ ఇలా ఎక్కడ అవకాశం వచ్చినా తాను నటిస్తానని విజయ్ సేతుపతి పేర్కొన్నాడు. ఇక ఫర్జి వెబ్ సిరీస్ విషయానికి వస్తే… బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ మరియు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోంది. ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ – డీకేలు ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు