ఈ సారి సంక్రాంతి పోటీలో తెలుగు సినిమాలతో పాటు కోలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో, నందమూరి బాలయ్య వీర సింహా రెడ్డితో సంక్రాంతి బరిలో ఉంటున్నారు. వీరితో పాటు తమిళనాడు స్టార్స్ విజయ్ తలపతి వారసుడుతో, అజిత్ కుమార్ తెగింపుతో వస్తున్నారు. ఇందులో ప్రధానమైన పోటీ వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి, వారసుడు మధ్య ఉంది. తెగింపు కొంత వరకు పోటీ ఇచ్చినా.. పెద్దగా ప్రభావమైతే చూపదని చెప్పొచ్చు.
తెలుగులో తెగింపు కంటే.. వారసుడుపై ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ తో ఉన్నారు. అందుకు మూడు కారణాలు ఉన్నాయి.
ఈ కారణాలతో వారసుడును వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డితో సమానంగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్నంత ఇంట్రెస్ట్ మేకర్స్ చూపించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా హీరో విజయ్ తలపతి వారసుడు పెద్దగా పట్టించుకోవడం లేదని అర్థమవుతుంది. విజయ్ ఇప్పటి వరకు వారసుడుకు సంబంధించిన ఒక అప్డేట్ ను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.
తెలుగు వెర్షన్ ప్రమోషన్ ల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు.. వారసుడు ప్రమోషన్స్ కు విజయ్ ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. అంటే విజయ్ తెలుగు ప్రమోషన్స్ కు వస్తాడని దిల్ రాజు కు కూడా నమ్మకం లేదు.
ఇదిలా ఉండగా, విజయ్ ఈ రోజు తన ట్విట్టర్ లో బాలీవుడ్ సినిమా పఠాన్ ట్రైలర్ ను షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. “తన సినిమా ప్రమోషన్లను పట్టించుకోవడం లేదు.. కానీ, బాలీవుడ్ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నాడు” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా వారసుడు 14వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. మరి ఆ లోపు అయినా.. విజయ్ ప్రమోషన్ల కోసం తెలుగు రాష్ట్రాలకు వస్తాడో.. రాడో చూడాలి మరి.