Ramcharan: “విక్రమ్” ట్రైలర్ లాంచ్ చేసిన చరణ్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా , లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్”
విజయ్ సేతుపతి , ఫహాద్ ఫాజిల్ లాంటి విలక్షణమైన నటులు ఈ సినిమాలో నటించడం వలన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయ్. రీసెంట్ గా తమిళ్ లో రిలీజైన ట్రైలర్ చూడగానే లోకేష్ సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది.

తమిళ్ లోనే కాదు తెలుగు ప్రేక్షకులలో కూడా లోకేష్ వర్క్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక తెలుగు ట్రైలర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ ట్రైలర్ ను లాంచ్ చేసారు.
ఇప్పటికే తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రిలీజైన తెలుగు ట్రైలర్ కి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు.

లోకేష్ కనగరాజ్ టేకింగ్ , అనిరుధ్ రవిచంద్రన్ బాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవుతాయని ఉహించవచ్చు.
ఈ రెండిటిని మించి కమల్ వాయిస్ లో వస్తున్న డైలాగ్స్ గూస్బూమ్స్ తీసుకొస్తున్నాయి అని చెప్పొచ్చు.
కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్ మరియు శివాని నారాయణన్ తదితరులు ఈ సినిమాలో కనిపించనున్నారు.
ఈ సినిమా జూన్ 3 న విడుదల కానుంది. నితిన్ బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ దీనిని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు