Vishal : ప్రియురాలితో పెళ్లి పై క్లారిటీ

సినిమా ఇండస్ట్రీలో ఉండే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో హీరో విశాల్ కూడా ఒకరు. ఇప్పటివరకు తన పెళ్లి విషయం గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. కేవలం తను ప్రేమించిన అమ్మాయిని త్వరలోనే పరిచయం చేస్తానంటూ 40 ఏళ్ల వయసు వచ్చినా కూడా దాటేస్తూ ఉన్నాడు విశాల్. ప్రస్తుతం పలు క్రేజీ సినిమాలలో నటిస్తూనే దక్షిణాది భారత నటీనటుల సంఘానికి కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా విశాల్ చుట్టూ ప్రేమ పెళ్లికి సంబంధించిన వార్తలు చాలా వైరల్ గా వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశాల్ మళ్లీ తన పెళ్లి ఊసు ఎత్తాడు. త్వరలోనే తనకు కాబోయే భార్యను పరిచయం చేయబోతున్నట్లు విశాల్ పేర్కొనడం విశేషం. ఎప్పటిలాగే నడిగర్ సంఘం భవనంతో తన పెళ్లికి ముడి పెట్టాడు విశాల్. “నటీనటుల యూనియన్ భవన నిర్మాణ పనులు మూడేళ్ల నుంచి కొనసాగుతున్నాయి.

త్వరలోనే ఆ భవనం పూర్తవుతుంది. అది పూర్తయిన వెంటనే నేను పెళ్లి చేసుకుంటా. నాది ప్రేమ వివాహమే. నాకు కాబోయే అమ్మాయిని సమయం వచ్చినప్పుడు పరిచయం చేస్తా” అంటూ షాక్ ఇచ్చాడు విశాల్. దీంతో విశాల్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారని వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రస్తుతం విశాల్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు. త్వరలోనే అతడి ‘లాఠీ’ మూవీ విడుదల కాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు