Vishal : ప్రభాస్ పెళ్లి తో తన పెళ్లిని ముడిపెట్టిన హీరో విశాల్

ప్రస్తుతం తెలుగు వారు ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్లి ఎవరిదనా ఉంది అంటే అది మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ దే. ఈ హీరో బాహుబలి సినిమాతో పాన్ ఇండియా పరంగా క్రేజ్ తెచ్చుకున్నా కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం తన సినిమాల కన్నా తన పెళ్లి గురించి ఎక్కువగా ఎదురు చూస్తున్నారు అనదంలో అతిశయోక్తి లేదు.

అయితే దీనికి కారణం లేకపోలేదు ప్రభాస్ కి ప్రస్తుతం నాలుగు పదుల వయసు దాటిపోయింది. ప్రభాస్ కన్నా చిన్న హీరోలు కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కనేసి తమ వారసుల్ని ప్రకటించేశారు. కానీ ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా అలానే ఉన్నారు. అందుకే అభిమానుల్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా ప్రభాస్ పెళ్లి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల ఈ హీరో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ పెళ్లి చేసుకుంటారు అని వార్త వచ్చిన అదంతా కేవలం రూమర్స్ అని ఆ హీరోయిన్ కొట్టి పడేసింది. ఇక కథ మళ్ళీ మొదటికి వచ్చి, ప్రభాస్ పెళ్లిపై చర్చలు మొదలయ్యాయి.

దానికి తోడు ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో కూడా యువ హీరోలు శర్వానంద్ మరియు అడవి శేషు వారి పెళ్లి గురించి అడగగా ముందు ప్రభాస్ పెళ్లి కానీయండి అంతు జోకు వేశారు. ఇక ఇప్పుడు కోలీవుడ్ హీరో విశాల్ కూడా ఇలానే కొన్ని కామెంట్స్ చేశారు.

- Advertisement -

గత నాలుగేళ్లుగా పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి దేనికో ఒకదానికి ముడిపెడుతూనే వస్తున్న విశాల్ ప్రస్తుతం ‘లాఠీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ హీరోని పెళ్లి గురించి అడగగా,‌ ‘ప్రభాస్ పెళ్లి చేసుకున్న రోజు నేను కూడా చేసుకుంటా’ అని ఇంటర్వ్యూ ల్లో తేల్చేశాడు.

ఇక ఈ కామెంట్ విన్న ప్రభాస్ అభిమానులు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు