Vishal : లాఠీ టీజర్ ఎప్పుడంటే ?

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నుంచి వస్తున్న తాజా చిత్రం లాఠీ. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ లాఠీ చిత్రం చిత్రీకరణ సందర్భంలోనే విశాల్ కు గాయాలు అయ్యాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ చిత్రంలో విశాల్ ఒక కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తున్నాడని తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నమోదు చేశాయి. దాదాపు అన్ని పోస్టర్ లలో విశాల్ చేతిలో లాఠీ పట్టుకుని ఉన్నాడు. అలాగే బాడీ అంతా రక్తంతో తడిసి ఉంది. ఈ పోస్టర్ లతో లాఠీ సినిమాలో ఎంత యాక్షన్ ఉంటుందో అర్థమవుతుంది. సెకాండాఫ్ లో దాదాపు 45 నిమిషాల పాటు ఒక యాక్షన్ సన్నివేశం ఉంటుందని, అది సినిమాకు ప్లస్ గా ఉంటుందని చిత్ర యూనిట్ స్వయం గా ప్రకటించింది.
ఇది ఇలా ఉండగా లాఠీ చిత్రం గురించి చిత్ర యూనిట్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ చిత్రం టీజర్ డేట్ ను లాక్ చేశారు. ఈ నెల 13వ తేదీన చిత్ర టీజర్ తోపాటు మొదటి పాట గ్లింప్స్ ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే అతి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేస్తామని చెప్పారు.


సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు