Vishnu Priya : అకౌంట్ హ్యాక్

యాంక‌ర్ విష్ణుప్రియ అతి చిన్న వ‌య‌స్సులోనే మోడ‌లింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.  ఇక అప్పటినుంచి చిన్న వెబ్ సిరీస్‌ల‌లో న‌టించింది. ఆ త‌రువాత చెక్‌మెట్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. కానీ అప్పుడు ఆ సినిమా విడుద‌ల కాలేదు. గ‌త ఏడాది ఓటీటీలో విడుద‌లైంది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్రాల్లో అడుగుపెట్టి ఈ అమ్మడు యాంక‌ర్‌గానే పాపుల‌ర్ అయింది.

నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. త‌న అంద‌మైన ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫాలోయింగ్ ఎప్ప‌టిక‌ప్పుడు పెంచుకుంటుంది విష్ణుప్రియ‌. ప్ర‌స్తుతం ఈమె షోలు ఏవి పెద్ద‌గా లేక‌పోవ‌డం వ‌ల్ల క‌నిపించ‌డం లేదు. ఈ మ‌ధ్య స‌డెన్‌గా ఓ బ్రాండ్‌కి ప్ర‌మోష‌న్ చేస్తూ టాప్ లెస్ గా క‌నిపించి అంద‌రికీ షాక్ ఇచ్చింది.

తాజాగా విష్ణుప్రియ పేస్ బుక్ అకౌంట్‌లో అశ్లీల ఫోటోలు, వీడియోలు ద‌ర్శ‌న‌మిచ్చి షాక్‌కి గురి చేశాయి. ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ అయింద‌ని.. స‌మాచారానికి అంద‌రికీ చేర‌వేసి, పేజీని అన్‌ఫాలో అవ్వ‌మ‌ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేసింది విష్ణుప్రియ‌. సోష‌ల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ రీల్స్‌, వీడియోస్‌తో సంద‌డి చేసే విష్ణుప్రియ‌కి ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ సుమారు 11ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇక ఫేస్ బుక్‌లో 4 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అకౌంట్ హ్యాక్ అయింద‌ని ఫేస్‌బుక్ టీమ్‌కి ఫిర్యాదు చేసింది విష్ణుప్రియ‌. మ‌ళ్లీ కొత్త అకౌంట్ రావ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు