Vishwak Sen : ధమ్కీ ఇవ్వడానికి వస్తుండు..

వెళ్లిపోమాకే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్ సేన్.
ఇక రెండో సినిమా ఈ నగరానికి ఏమైంది, ఆ తరువాత ఫ‌ల‌క్‌నుమాదాస్ సినిమాలతో  స్టార్ హోదా తెచ్చుకున్నాడు విశ్వక్‌సేన్. తన నటనతో ఎక్కడా తగ్గకుండా కుమ్మేశాడు. ఈ సినిమాతో యూత్ లో మంచి గుర్తింపును తెచ్చుకున్న విశ్వక్‌సేన్ వరుస సినిమాలలో నటిస్తూ అదరగొడుతున్నాడు. ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ ధమ్కీ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీలో విశ్వక్‌సేన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ధమ్కీ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 17వ తేదీన అంటే శివరాత్రి కానుకగా, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ధమ్కీ మూవీ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

అంతే కాకుండా ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ధమ్కీ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో విశ్వక్‌సేన్ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటుంది. వైట్ కలర్ ప్యాంట్ మరియు పింక్ కలర్ కోర్టును ధరించి ఉన్నాడు. ప్రస్తుతం ధమ్కీ చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. అదే సమయంలో ప్రమోషన్స్ ను కూడా గ్రాండ్ గా చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు