Dhamki : పాత కథే కానీ.. కొత్తగా

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మొదటి సినిమాతోనే పేరు తెచ్చుకున్న హీరోలు చాలా తక్కువ మంది. అలా ఫ‌ల‌క్‌నుమాదాస్ సినిమాతో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. తన నటనతో ఎక్కడా తగ్గకుండా కుమ్మేశాడు. ఈ సినిమాతో యూత్ లో మంచి గుర్తింపును తెచ్చుకున్న విశ్వక్ సేన్ వరుస సినిమాలలో నటిస్తూ అదరగొడుతున్నాడు. ఇక విశ్వక్ సేన్ ప్రస్తుతం స్వయంగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ధమ్కీ.

ఈ సినిమా మలయాళం లో హిట్ అయిన “అంగమాలి డైరీస్” మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాకి విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో.. తరుణ్ భాస్కర్, రావు రమేష్, శౌర్య, అజయ్, హైపర్ ఆది, పృధ్విరాజ్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. లియాన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ‘నేను లోకల్’, ‘సినిమా చూపిస్త మామ’ సినిమాల ఫేమ్ ప్రసన్నకుమార్ బెజవాడ స్టోరీ అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. ఇటీవల విశ్వక్ సేన్, బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి వెళ్ళిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బాలయ్యను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు విశ్వక్ సేన్. బాలయ్య చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే రీతిలో ఉంది.

- Advertisement -

ఎన్నో రకాల ఆసక్తికరమైన సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ చిత్రంలో విశ్వక్ రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్నాడా.. లేదా ఒక్కడే రెండు పాత్రలలో కనిపిస్తాడా అనేది వేచి చూడాలి. గతంలో తెరకెక్కిన విక్రమార్కుడు, గౌతమ్ నంద తరహాలో ఒక హీరో ప్లేసులో మరో హీరో వెళ్లే కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించినట్టు కనబడుతోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు