Viswaksen : యూట్యూబ్ లో రివ్యూ చేసేవారిపై హీరో ఫైర్.. అంత కోపం ఏంటి భయ్యా..

Viswaksen : టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఈ సినిమాతో మంచి టాక్ ను అందుకున్నాడు.. ఈ సినిమా పై ఓ యూట్యూబర్ రివ్యూ ఇచ్చారు.. ఆ రివ్యూను చూసిన హీరో అతని పై ఓ రేంజులో మండిపడ్డారు.. ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది..

viswaksen fire on youtuber video viral
viswaksen fire on youtuber video viral

ఆ వీడియోను షేర్ చేస్తూ సినిమా రిలీజ్ అవ్వక ముందే చెంబులు పట్టుకొని వెళ్తున్నారు మీ జేబులు నింపుకోవడానికి అంటూ విశ్వక్ అతని పై మండిపడ్డారు.. ఈ సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్నాయి అది యూట్యూబ్ లో వీడియోలు చేసేవారికి మజాక్ అయిపోయింది.. ఏది పడితే అది పెడతారు అంటూ మండిపడ్డారు..

అంతేకాదు వీడు ఒక పది నిమిషాలు షార్ట్ ఫిలిం తీస్తే చూద్దాం.. మనం లేదంటే అడ్రస్ తప్పిపోయిన వాళ్ళు అనుకుని వదిలేద్దాం. పది నిమిషాల షార్ట్ ఫిలిం తీయండి, ఇలాంటి ఒపీనియన్స్ బయట బజార్ లో పెట్టి తిరిగే వాళ్ళందరూ. ఇక్కడ మన చుట్టూ ఉన్న కొందరు పైరసీ కంటే డేంజరస్. వీళ్లు ఒక ఫిలిం సెట్ లో పనిచేసే వాళ్ళ స్వెట్, బ్లడ్ అలాగే లెక్కలేనన్ని బతుకుదెరువుల గురించి ఆలోచిస్తే మంచిది. నువ్వు తీయు ఒక పది నిమిషాలు షార్ట్ ఫిలిం అప్పుడు నీకు నీ ఒపీనియన్ కి కొంచెం రెస్పెక్ట్ ఉంటది. శవాల మీద పేలాలు ఏరుకునే రకం అంటూ విశ్వక్ సేన్ ఓ రేంజ్ లో మండిపడ్డారు.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషనల్ అవుతుంది.. ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు