The Vaccine War : టైటిల్ తోనే హైప్..

వివేక్ అగ్ని హోత్రి తెర‌కెక్కించిన ది క‌శ్మీర్ ఫైల్స్ ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో అందిరికీ తెలిసిందే. ఈ ఏడాది అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన హిందీ చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచింది. ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌లే వివేక్ అగ్నిహోత్రి తీయ‌బోయే సినిమా టైటిల్ అంటూ ‘The (–) War’ పోస్టు చేసి, పూర్తి టైటిల్ కనుక్కొండి అంటూ ఓ టెస్ట్ పెడుతూ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.

ఎట్ట‌కేల‌కు వివేక్ అగ్ని హోత్రి త‌న తీయ‌బోయే సినిమా టైటిల్ ని ప్ర‌క‌టించారు. వివేక్ త‌న రాబోయే చిత్రం ది వ్యాక్సిన్ వార్ అనే టైటిల్‌ని వెల్ల‌డించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లక్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ థ్రిల్ గా ఉందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రం దేశంలో COVID-19, టీకా కసరత్తుల గురించి కొన్ని అధ్యాయాలను తెలుపుతుంద‌ని టైటిల్ పోస్టర్ ద్వారా స్పష్టంగా క‌నిపిస్తోంది.

భార‌త‌దేశ సినీ ప్రేక్ష‌కుల కోసం దేశం ఏం సాధించిందో, ప్ర‌పంచం గ‌మ‌నించే విధంగా సినిమాల‌ను తీయాల‌ని వివేక్ న‌మ్మాడు కాబ‌ట్టే ఈ చిత్రాన్ని మొత్తం 11 భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా దేశవ్యాప్తంగా ‘ది వ్యాక్సిన్ వార్’ ని ఆగస్టు 15, 2023న విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఐయామ్ బుద్ద ప్రొడ‌క్ష‌న్ పై ప‌ల్ల‌వి జోషి, వివేక్ అగ్నిహోత్రి కలిసి నిర్మిస్తున్నారు. కరోనా మహమ్మారి నాటి పరిస్థితులు, టీకా కోసం జరిగిన ప్రయత్నాలు, అందులో మన దేశ శాస్త్రవేత్త‌ల పాత్ర వంటి కీలక అంశాలను ఈ చిత్రంలో చూపించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో న‌టించ‌బోయే న‌టీన‌టుల‌ను త్వరలోనే టీం ప్ర‌క‌టించ‌నున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు