VT12 : టైటిల్ తోనే భారీ అంచనాలు

మెగా కంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. ఈ మెగా హీరో 2014లో ముకుంద సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను కొంత వరకు ఆకట్టుకున్నా.. హిట్ మాత్రం సాధించలేదు. తరువాత క్రిష్ దర్శకత్వంలో నటించిన చారిత్రాత్మక చిత్రం ”కంచె” చేశాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించినా, హిట్ టాక్ తెచ్చుకోవడంలో విఫలమైంది.

దీని తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమా చేశాడు. దీనిలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మెగా హీరో నుంచి ఇటీవల ఎఫ్3 సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కమర్షియల్ హిట్ అయింది. కానీ, వరుణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం అందించలేకపోయింది. దీంతో తర్వాత వచ్చే సినిమాలపై చాలా ఫోకస్ చేశాడు.

విభిన్నమైన స్టోరీలను ఎంచుకుంటూ సినిమాలను లైనప్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్.. ఇటీవల ”ఘోస్ట్” సినిమాను తెరకెక్కించిన ప్రవీణ్ సత్తార్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ”మిక్కి జె మేయర్” సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

అయితే వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా నేడు ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ ను ఇచ్చారు. ఒక పోస్టర్ తో సినిమా టైటిల్ ”గాండీవధారి అర్జున” అని ఫిక్స్ చేసినట్టు అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ లో వరుణ్ గన్స్ పట్టుకుని ఉన్నాడు. అలాగే బ్యాగ్రౌండ్ లో బ్లాస్టింగ్ అయిన కార్లు, బిల్డింగ్స్ ను చూస్తే.. సినిమాపై ఆసక్తి ని పెంచేలా ఉంది. ఈ పోస్టర్ ని వరుణ్ తన సోషల్ మీడియా పోస్ట్ చేశాడు.

అలాగే ఈ పోస్టర్ లో గాండీవధారి అర్జున సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ గురించి కూడా అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు