Waltair Veerayya : “నువ్వు శ్రీదేవైతే నేను చిరంజీవి”.. అంటున్న మెగాస్టార్

పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ వాల్తేరు వీరయ్య లో హీరోగా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ శృతిహాసన్, మెగాస్టార్ సరసన జోడిగా నటించగా, టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మాస్ మహారాజా రవితేజ ఈ మూవీలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ బాస్ పార్టీ అనే అదిరిపోయే మాస్ బీట్ ఉన్న సాంగ్ ను విడుదల చేసింది. ఆ సాంగ్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

ఇక ఇటీవల వాల్తేరు వీరయ్య లో రవితేజ షూటింగ్ పార్ట్ కు సంబంధించిన స్టిల్స్ కూడా మైత్రి మూవీ మేకర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రవి తేజ టీజర్ తో ప్రేక్షకులకు సినిమాపై అంచనాలను పెరగిపోయ్యాయి. అటు బాస్ పార్టీ సాంగ్ 25 మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసి రీల్ మేకర్స్ కు ఫేవరెట్ గా మారింది. ఇప్పుడు తాజాగా సెకండ్ సింగిల్ “నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి” అనే సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర బృంద. ఈ సాంగ్ లో చిరంజీవి మరియు శృతిహాసన్ డాన్స్ తో అదరగొట్టారు. శృతిహాసన్ లైట్ కలర్ సారీలో మెరువగా, మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ లుక్ లో కనిపించారు. అటు ఈ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. చిరు మరియు శృతిహాసన్ వేసే స్టెప్పులు పాటకు హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు