Waltair Veerayya Trailer : సంక్రాంతికి పూనకాలు పక్కా..

పూనకాలు లోడింగ్.. ఇది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీ ట్యాగ్ లైన్. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ లో ఈ ట్యాగ్ లైన్ ను చాలా గట్టిగా చెప్పారు. తమ సినిమా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పిస్తుంది అనే నమ్మకంతో ప్రతి చోట ఈ లైన్ ను వాడేశారు. అంతే కాదు.. ఈ ట్యాగ్ లైన్ తో ప్రత్యేకంగా ఒక పాటను కూడా తయారు చేశారు. దీనిలో మెగాస్టార్, మస్ మాహారాజ కలిసి మాస్ స్టెప్స్ కూడా వేశారు.

మరి ఈ పూనకాలు లోడింగ్ అనేది అప్డేట్స్ కే పరిమితం అవుతుందా.. లేదా సినిమా చూశాకా నిజంగానే అభిమానుకుల పూనకాలు వస్తాయా ? అనేది పెద్ద ప్రశ్న. ఇది తెలియాలంటే జనవరి 13 వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే దీనికి ముందు సినిమా గురించి తెలిపే ట్రైలర్ తాజాగా వచ్చింది. ఈ ట్రైలర్ పూనకాలు తెప్పియడంలో సక్సెస్ అయిందా లేదా అనేది చూద్దాం.

ట్రైలర్ ప్రారంభంలో వచ్చే డైలాగ్స్ తోనే మెగాస్టార్ ఈ సినిమాలో ఒక ఇంటర్ నేషనల్ క్రిమినల్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. “మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టిందే ఆయన్ను చూసి” అనే డైలాగ్ మెగా అభిమానులకు పూనకాలు తెప్పింస్తోంది. అలాగే “మీ కథలోకి నేను రాలా.. నా కథలోకే మీరందరూ వచ్చారు.. వీడు నా ఎర.. మీరే నా సొర..” అనే డైలాగ్స్ తో సినిమా ఒక రివేంజ్ స్టోరీ అని చెప్పకనే చెప్పేశారు. దీంతో పాటు రవితేజ “వైజాగ్ లో గట్టి వేటగాడు లేక ఒక పులి పూనకాలతో ఊగుతుందట” అంటూ చెప్పే డైలాగ్ తో చిరుకి, రవితేజకు మధ్యలో పోరు ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు “రికార్డ్స్ లో నా పేరు ఉండం కాదు.. నా పేరుపైనే రికార్డ్స్ ఉంటాయి” అంటూ మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే డైలాగ్స్ భారీగానే ఉన్నాయి.

- Advertisement -

మొత్తంగా సినిమాలో ఫన్, యాక్షన్, మాస్ ఎలివేషన్స్, హీరోయిన్ తో డ్యూయెట్స్ పుష్కలంగా ఉంటాయని ఈ ట్రైలర్ తో అర్థమవుతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ లుక్, బాడీ లాంగ్వేజ్ చూస్తే వింటేజ్ చిరును చూస్తున్నట్టు ఉంది. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య పూనకాలు తెప్పించడం దాదాపు ఖాయంగానే ఉంది.

For More Updates :
Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు