Veerayya vs Veera Simha : పాట పాటకు పోటీ..

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పోటీ అంటేనే ఆసక్తికరంగా ఉంటుంది. ఏ హీరో గెలుస్తాడో.. ఏ హీరో జీరో అవుతాడో అంటూ చర్చలు జరుగుతాయి. అయితే ప్రతి సారి కంటే ఈ సారి సంక్రాంతి పోటీ రసవత్తరంగా ఉంది. ఇందుకు టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, బాలయ్య ఈ పోటీలో ఉండటమే. వాల్తేరు వీరయ్యతో చిరంజీవి, వీర సింహా రెడ్డి బాలయ్య ఈ సారి సంక్రాంతి బరిలో నిలవబోతున్నారు. ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఉండటంతో మరే హీరో కూడా సంక్రాంతికి పోరుకు ముందుకు రాలేదు.

వీరితో పాటు తమిళ స్టార్స్ విజయ్ వారీసుతో, అజిత్ తునీవుతో సంక్రాంతి బరిలో ఉన్నా.. తెలుగు టాప్ హీరోలైన చిరంజీవి, బాలయ్యపైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ పోటీలో మెగాస్టార్ పై చేయి సాధిస్తాడా ? నందమూరి నటసింహం హిట్ కొడుతాడా ? అంటూ బెట్టింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. దీంతో పాటు వీరి సినిమాల నుంచి వస్తున్న అప్డేట్స్ పై కూడా చర్చ సాగుతుంది. అలాగే రెండింటిని పోల్చుతున్నారు. ఇప్పటికే బాస్ పార్టీ vs జై బాలయ్య, శ్రీదేవి.. చిరంజీవి vs సుగుణ సుందరి అంటూ అభిమానులు పోల్చారు.

తాజాగా వాల్తేరు వీరయ్య నుంచి వచ్చిన టైటిల్ సాంగ్ ను, వీర సింహా రెడ్డి నుంచి వచ్చిన మా బావ మనోభావాలు పాటలను పోల్చుతున్నారు. ఈ రెండు పాటల్లో ఎవరు గెలిచారు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోల్ కూడా నిర్వహిస్తున్నారు.

- Advertisement -

కాగా వీరయ్య టైటిల్ సాంగ్ విడుదలైన 15 గంటల్లోనే 3.2 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. ఇంకా 24 గంటలు కూడా గడవక ముందే 3 మిలియన్ మార్క్ ను అందుకున్న టైటిల్ సాంగ్.. ఇక ముందు వ్యూస్ భారీగా పెరిగే అవకాశం ఉంది. అలాగే మా బావ మనోభావాలు సాంగ్ విడుదలైన మూడు రోజులు కావాస్తోంది. ఈ సాంగ్ కు ఇప్పటి వరకు 8.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ఏది ఏమైనా వాల్తేరు వీరయ్యకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, వీర సింహా రెడ్డికి థమన్ అందించిన మ్యూజిక్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ స్టార్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో వాల్తరు వీరయ్య, వీర సింహా రెడ్డిపై అంచనాలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. మరి ఈ ఇద్దరిలో సంక్రాంతి పోటీలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే.. సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు