Waltair Veerayya: వేచి చూడాల్సిందే.

రవీంద్ర బాబీ , ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తన మొదటి సినిమా పవర్ తోనే దర్శకుడిగా తన పవర్ ఏంటో టాలీవుడ్ కి పరిచయం చేసాడు. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు దర్శకత్వం చేసే అవకాశాన్ని సాధించుకున్నాడు.కానీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

పవన్ కళ్యాణ్ తో సినిమా బాబీ ను నిరాశ పరచినా దాని నుంచి తేరుకొని వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ”జై లవకుశ” సినిమా ను చేసి దర్శకుడిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు బాబీ. జై లవకుశ చిత్రం తర్వాత మల్టీ స్టార్రర్ సినిమా చేసి ”వెంకీమామ” తో మంచి హిట్ అందుకున్నాడు బాబీ.

ప్రస్తుతం బాబీ చేస్తున్న చిత్రం వాల్తేర్ వీరయ్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్ నటించింది.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇదివరకే మంచి అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బాబీ కూడా ఈ సినిమాపై మంచి నమ్మకంతో ఉన్నాడు.ఈ సినిమాను చుసిన మెగాస్టార్ ఇది డబల్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పారని , చెప్పుకొచ్చాడు బాబీ.ఈ సినిమా లో వీరయ్య ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అభిమానులకు పూనకాలు వస్తాయి అని తెలిపాడు బాబీ. బాబీ మాటల్లో ఉన్న నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు