Tollywood : సినిమాల పరిస్థితి ఏంటి

తెలుగు సినిమా ప్రేక్షకులకు సినిమా అంటేనే ఒక పండగ, అటువంటిది పండగలు, సినిమాలు ఒకేసారి వస్తే అంతకు మించిన ఆనందం ఇంకేముంది. తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు తమ సినిమాను పండగకు రిలీజ్ చెయ్యాలని ముందునుంచే ప్లాన్స్ వేస్తూ ఉంటారు.
అవి కొన్ని సార్లు వర్కౌట్ అవుతాయి, ఇంకొన్ని సార్లు అవ్వవు. ఇక విషయానికి వస్తే నిన్న దీవాలి సందర్బంగా మొత్తం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. దీనిలో ఏ టపాకాయ్ పేలింది, ఏది తుస్సుమందో ఒక లుక్ వేద్దాం.

ఓరిదేవుడా..

ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు “విశ్వక్ సేన్”. ఒక నటుడు గానే కాకుండా,దర్శకుడిగా కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ – మిథిలా పాల్కర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఓరి దేవుడా’.తమిళ్ సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ ను తెచ్చుకుంది. ఫ్రెండ్స్ భార్య భర్తలు అయితే ఎలా ఉంటుంది అని చూపిస్తూ, దీనికి కొంచెం దేవుడు అనే ఒక ఫాంటాసి టచ్ ఇచ్చి ఆడియన్స్ ఎంటర్టైన్ చేసారు.

- Advertisement -

ప్రిన్స్..

థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ నవ్వించటమే ద్వేయంగా చేసుకుని అనుదీప్ మలిచిన చిత్రమే ప్రిన్స్. శివకార్తికేయన్ – మరియా నటించిన ఈ సినిమా లాజిక్స్ కి దూరంగా లాఫింగ్ కి దగ్గరగా అనిపించింది. సినిమా మొదటి నుండి చివరివరకు అనుదీప్ మార్క్ కామెడీతో నింపేసాడు. ఏదేమైనా కామెడీ అంతా వర్కౌట్ కాకపోయినా, మరీ బోర్ కొట్టించకుండా ఆడియన్స్ ను కొంతవరకు సేఫ్ జోన్ లోనే ఉంచాడు.

సర్ధార్..

కార్తీ – రాశిఖన్నా హీరోహీన్లుగా నటించిన చిత్రం సర్ధార్. ఈ చిత్రాన్ని పి.ఎస్ మిత్రన్ తెరకెక్కించారు. ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరక్కించడమే కాకుండా ఒక కొత్త విషయాన్ని చెప్పగలిగాడు దర్శకుడు. ఈ సినిమాలో కార్తీ గూఢచారి పాత్రలో కనిపించి ఆద్యంతం ఆకట్టుకున్నాడు.

జిన్నా..

మంచు విష్ణు, పాయల్ రాజపుత్ , సన్నీ లియోన్ నటించిన చిత్రం జిన్నా. వరుస డిజాస్టర్ లను మూటకట్టుకున్న మంచు ఫ్యామిలీకి ఈ సినిమా కలిసొస్తుంది అనుకున్నారంతా. కానీ ‘జిన్నా’ సినిమా విష్ణు కంటే సన్నీ లియోనీకే బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్ సన్నీ లియోని మాత్రమే గుర్తుంటుంది.
ఈ సినిమా మరీ విష్ణు చెప్పినట్లు కాకుండా, ఓ మోస్తరుగా బాగానే ఉంది.

మొత్తంగా నిన్న రిలీజైన అన్ని సినిమాలు చాలా బాగున్నాయి అనే స్థాయిలో లేకపోయినా, పర్వాలేదనిపించుకున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు