Parasuram : పరశురామ్ స్టెప్ ఎటు వైపు..?

టాలీవుడ్ లో ఒక కాంబో హిట్ అందుకుంటే, మళ్లీ జతకట్టడం కామన్. అది హీరో – డైరెక్టర్ అయినా, డైరెక్టర్ – నిర్మాత అయినా కాంబోను సెట్ చేసుకుంటారు. వారి మధ్య వరుసగా హిట్స్ పడితే క్రేజీ కాంబోగా ఇండస్ట్రీలో దూసుకెళ్తారు. ప్రస్తుతం పరశురామ్ – గీతా ఆర్ట్స్ క్రేజీ కాంబినేషన్ అని చెప్పవచ్చు.

ఇప్పటికే వీరి మధ్య “శ్రీరస్తు శుభమస్తు”, గీత గోవిందం సినిమాలు వచ్చాయి. శ్రీరస్తు శుభమస్తు అల్లు శిరీష్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా ఉంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండకు గీత గోవిందం ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీతో విజయ్ కెరీర్ మలుపు తిరిగిందని చెప్పవచ్చు.
దీని తర్వాత ఈ హిట్ కాంబోను కాదని పరశురామ్, మైత్రీ మూవీ మేకర్స్ తో జత కట్టి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో, పరశురామ్ అంటే, హీరోలకు, నిర్మాతలకు ఓ నమ్మకం ఏర్పడింది. దీంతో ఆయనతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ తరుణంలో పరశురామ్ నెక్ట్స్ స్టెప్ ఏంటనే ఆసక్తి పెరుగుతుంది. నిజానికి పరశురామ్, అల్లు అరవింద్ మధ్య మంచి సంబంధాలున్నాయి. అందువల్లే, గీతా ఆర్ట్స్ తో బ్యాక్ టూ బ్యాక్ శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం సినిమాలు వచ్చాయి. వ్యూచర్ లో వీరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం లేకపోలేదు.

- Advertisement -

సర్కారు వారి పాట తర్వాత అక్కినేని నాగ చైతన్యతో చేయనున్నట్టు పరశురామ్ ఇప్పటికే అనౌన్స్ చేశాడు. నిజానికి సూపర్ స్టార్ కంటే, ముందే ఈ సినిమా రావాల్సింది. కానీ మహేష్ అవకాశం మళ్లీ రాదని, నాగ చైతన్య ప్రాజెక్ట్ కు బ్రేకులు వేసి, సర్వారు వారి పాట చేశాడు. చైతన్య కోసం పరశురామ్ ఇప్పటికే స్టోరీ రెడీగా ఉందట, దానికి టైటిల్ ’’నాగేశ్వర్’’ అని కూడా ఫిక్స్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

కాగ ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా, విక్రమ్ కుమార్ తో థాంక్యూ సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. దీంతో పాటు వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కంటే ముందుగానే నాగ చైతన్య – పరశురామ్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.

అయితే ఈ సినిమా తర్వాత పరశురామ్, గీతా ఆర్ట్స్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు టాలీవుడ్ లో వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు