Ashika Ranganath: తెలుగు హీరోయిన్స్‌కు కాంపిటీషన్ ఇస్తుందా ?

ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లకు కొరత ఉంది. అందుకే ఇతర భాషల నుంచి వచ్చే యంగ్ హీరోయిన్స్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ యంగ్ హీరోయిన్స్ తెలుగు తెరపైకి వచ్చి ఒక హిట్ కొట్టిన వెంటనే, ఇక్కడే సెటిల్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు ఇలాగే వచ్చి టాలీవుడ్ లో స్థిరపడి స్టార్ హోదాను తెచ్చుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా అలా పక్క భాష నుంచి వచ్చే హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇటీవల వీర సింహా రెడ్డి సినిమాతో తెలుగు తెరపైకి మరోసారి వచ్చిన హనీ రోజ్ కు తెలుగులో ఎంత పాపులారిటీ వచ్చిందో అందరికీ తెలిసిందే. హనీ రోజ్ కు ప్రస్తుతం తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయని సమాచారం. ఇది ఇలా ఉండగా, ఇప్పుడు మరో హీరోయిన్ టాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి రెడీ ఉంది. ఆమె ఎవరంటే.. శాండిల్ వుడ్ లో మంచి హీరోయిన్ గా ఎదుగుతున్న ఆశికా రంగనాథ్.

ఆశికా రంగనాథ్.. కన్నడ చిత్ర పరిశ్రమలోకి 2016లో క్రేజీ బాయ్స్ సినిమాతో అడుగుపెట్టింది. తర్వాత అక్కడే వరుసగా అవకాశాలు రావడంతో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు ఈమె కన్నడ పరిశ్రమతో పాటు ఇతర పరిశ్రమలపై కూడా కన్నెసింది. ఇటీవల పట్టతు అరసన్ అనే సినిమాతో కోలీవుడ్ కు ఇంట్రీ ఇచ్చింది. తాజాగా ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు తెరపైకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది.

- Advertisement -

అమిగోస్ సినిమా ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందే, ఈ భామ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ సినిమా నుంచి ఇటీవల “ఎన్నో రాత్రులు వస్తాయి కానీ..” అనే మేలోడీ సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నందమూరి బాలయ్య సాంగ్ ను ఈ సినిమాలో రీమీక్స్ చేశారు. ఈ పాటలో ఆశికా రంగనాథ్ అందానికి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.

ఈ సినిమా హిట్ అయితే, తెలుగులో ఈమెకు మరిన్నీ అవకాశాలు రావడం పక్కా అని అభిప్రాయపడుతున్నారు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల, కృతి శెట్టి తో పాటు మరి కొంత మందికి మాత్రమే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అమిగోస్ హిట్ అయితే, ఆశిక కూడా దర్శక నిర్మాతలకు మొదటి ఆప్షన్ కావొచ్చు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు