PS-1 : నిలుస్తుందా.. బోరు కొట్టిస్తుందా ?

కొన్ని సినిమాలకు నిడివి కలిసొస్తుంది. మరి కొన్ని సినిమాలకు నిడివినే కాటేస్తుంది. కథ, కథనం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటే.. సినిమా పెద్దగా ఉన్నా ప్రేక్షకులు చూస్తారు. అదే సినిమా నిడివి ఉండాల్సింనదాని కంటే చిన్నగా ఉన్నా నష్టమే. దీంతో పాటు ప్రేక్షకులకు నచ్చని కంటెంట్ తో వచ్చిన సినిమా కొంత వరకు అయిన ప్రేక్షకులకు చేరాలంటే నిడివి సరిపోయే మోతాదులో ఉండాలి. అలా లేకుంటే నిర్మాతల జేబులకు చిల్లు పడటం ఖాయమే. మొత్తంగా ఒక సినిమా హిట్ అవ్వాలన్నా, ఫట్ అవ్వాలన్నా నిడివి అనేది కీలకంగా ఉంటుంది.

ఇటీవల నాని హీరోగా వచ్చిన అంటే సుందరానికి సినిమా సినీ క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలను సంపాదించుకుంది. కానీ నిడివి ఎక్కువగా ఉండటం వల్ల బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టలేక కమర్షియల్ గా ప్లాప్ అయింది. అలాగే ఈ మధ్య కాలంలో చియాన్ విక్రమ్ హీరోగా వచ్చిన కోబ్రా సినిమా కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. అయితే మేకర్స్ తప్పును తెలుసుకుని విడుదల తర్వాత సినిమాను దాదాపు 20 నిమిషాలు ఎడిట్ చేశారు. అలా చేయడం వల్ల కోబ్రాకు కొంత వరకు కలిసొచ్చింది. 

ఇదిలా ఉండగా, మళ్లీ ఇలాంటి సమస్య పొన్నియిన్ సెల్వన్ కూడా వస్తుందా అనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తుంది. పొన్నియిన్ సెల్వన్ డైరెక్టర్ మణిరత్నం ఇటీవల ఒక సందర్భంలో తమ చిత్రం నిడివి 2 గంటల 50 నిమిషాల వరకు ఉంటుందని వెల్లడించాడు. దీంతో ప్రేక్షకులు ఇంత సమయాన్ని థియేటర్ లలో గడుపుతారా ?, ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా దర్శకుడు మణిరత్నం చేస్తాడా ? అనే ప్రశ్నలు వస్తున్నాయి. 

- Advertisement -

అయితే ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు అన్ని కూడా ఇలాంటి నిడివినే కలిగి ఉన్నాయి. బాహుబలి, మహానటి, అర్జున్ రెడ్డి, ది కాశ్మీర్ ఫైల్స్, KGF, తో పాటు RRR లాంటి సినిమాలు నిడివి ఎక్కువగా ఉన్నవే. దీంతో భారీ నిడివితో వస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా ?  లేదా నాని, విక్రమ్ సినిమాలా ప్రేక్షకులకు బోర్ కొట్టించి నిరాశపరుస్తుందా ? అని తెలియాలంటే ఈ నెల 30 వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు