Chatrapathi: టాలీవుడ్ హీరోలకు ఇప్పటికైనా తెలిసొస్తుందా?

టాలీవుడ్ లో వరుస పాన్ ఇండియా సినిమాలు ఇండియాను షేక్ చేస్తుంటే, కొన్ని సినిమాలు మాత్రం దారుణంగా బోల్తా పడుతున్నాయి. కంటెంట్ లేకున్నా బాలీవుడ్ పై మోజుతో అక్కడ డైరెక్ట్ సినిమాలు చేస్తూ, మరి కొన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తూ చేతులు కాల్చుకులున్నారు దర్శకనిర్మాతలు హీరోలు. ఇప్పుడు మరోసారి ఒక భారీ డిజాస్టర్ తో దెబ్బతిని టాలీవుడ్ కి గొప్ప గుణపాఠం నేర్పాడు బెల్లం కొండ వారసుడు.

అసలు విషయానికి వస్తే బాహుబలి2 తర్వాత టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసారు. అందులో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు కార్తికేయ2 సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత మీడియం రేంజ్ హీరోలు, చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. సినిమాలో కంటెంట్ ఉన్నా లేకపోయినా తమ ఫేమ్ తో ఆడించాలని చూస్తే గట్టి దెబ్బే పడుతుందని మరోసారి రుజువైంది. రీసెంట్ గా టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ హిందీ మూవీ ఛత్రపతి. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన రాజమౌళి ఛత్రపతికి రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా. మే12 న విడుదలైన ఈ సినిమా ఆల్ టైమ్ డిజాస్టర్ గా నిలిచి, హిందీలో కనీసం కోటి రూపాయలు కూడా వసూలు చేయలేక 0షేర్ తో బెల్లంకొండ పరువు పోగొట్టుకున్నాడు. తన సినిమాలకి హిందీ డబ్బింగ్ వ్యూస్ కి ఇంప్రెస్స్ అయ్యి బాలీవుడ్ జనాలు ఆదరిస్తారనుకున్న శ్రీనివాస్ కళలు ఆవిరయ్యాయి.

గతంలో విజయ్ దేవరకొండ కూడా ఇలాగే “లైగర్” సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవ్వొచ్చని కలలుగన్నాడు. చివరికి కంటెంట్ లేని చెత్త సినిమాతో వచ్చి చేతులు కాల్చుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన ఏజెంట్, మైఖెల్, శాకుంతలం చిత్రాలు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యి డిజాస్టర్లయ్యాయి. అంతేకాకుండా నేటివిటీ సమస్య వల్ల దసరా, విరూపాక్ష సినిమాలు బాగున్నా హిందీలో అంతగా పట్టించుకోలేదు. ఓవరాల్ బాలీవుడ్ పై మోజుతో కంటెంట్, స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టకుండా ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడం వల్ల హీరోల పరువు పోవడమే కాకుండా నిర్మాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా టాలీవుడ్ ప్రముఖులు కళ్ళు తెరిచి ఊరికే పాన్ ఇండియా సినిమాలని కాకుండా కథా, కధానాలపై దృష్టి పెడితే బాగుంటుందని ట్రేడ్ పండితుల అభిప్రాయం.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు