Yashoda : సూపర్ హిట్ దిశగా..

సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల్లో ఒకేరోజున విడుదల అయింది. అన్ని భాషల్లో కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే కలెక్షన్లను భారీగానే వసూలు చేసింది. 

టాలీవుడ్ విషయానికొస్తే..  నైజాంలో రూ.84 లక్షల షేర్, సీడెడ్ లో రూ.18 లక్షల షేర్, ఆంధ్రాలో రూ.63లక్షలు వసూల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.1.70 కోట్లు షేర్ వసూలు చేసింది. గ్రాస్ విషయానికి వస్తే.. తెలంగాణలో రూ.1.40 కోట్లు, ఆంధ్రాలో రూ. రూ.1.40 కోట్లు వసూలు చేయడం విశేషం. అదేవిధంగా తమిళనాడులో రూ.16లక్షలు షేర్, కర్ణాటక, రెస్ట్ ఆప్ ఇండియా కలిపి రూ.25లక్షలు, మలయాళంలో రూ.10లక్షలు, ఓవర్సిస్ లో 90 లక్షలు కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 6.32 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. 

ఇక ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలకు సైతం ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు.  ఈ కలెక్షన్లతో సమంతకి క్రేజ్ చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. మరోవైపు యశోద చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.21 కోట్లు జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.22 కోట్లు రాబట్టాలి. తొలి రోజు రూ.3.01 కోట్లు షేర్ వసూలు చేసినప్పటికీ.. ఇంకా రూ.19కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది. పాజిటివ్ టాక్ ను చూస్తుంటే ఖచ్చితంగా యశోద సినిమా లాభాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. రన్నింగ్ టైమ్ మొత్తంలో యశోద వసూళ్లు ఎలా ఉంటాయో వేచి చూడాలి. 

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు