టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. విడాకుల తర్వాత స్పీడ్ పెంచేసింది. టాలీవుడ్, కోలీవుడ్.. అని తేడా లేకుండా.. వరుసగా సినిమాలను లైన్ లో పెట్టేస్తుంది. తన బిజినెస్ మార్కెట్ ను పెంచుకోవడానికి పాన్ ఇండియా సినిమాలను సైతం చేసేస్తుంది. అలాగే పుష్ప లో స్పెషల్ సాంగ్ లో కూడా నటించి.. యుత్ తో ఈలలు వేయించింది.
సమంత లేటెస్ట్ గా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పై దృష్టి పెట్టింది. రుద్రమాదేవి ఫేం గుణశేఖర్ దర్శకత్వలో శాకుంతలం తో పాటు హరి శంకర్ – హరీష్ నారాయణ్ డైరెక్షన్ లో యశోద సినిమాను కూడా చేస్తుంది. కాగ సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న యశోద సినిమాను శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేశ్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.
అయితే ఈ మూవీ నుంచి తాజా గా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది. సమంత తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ ఫస్ట్ గ్లింప్స్ లో సమంత ఒక్కరే కనిపించినా.. సూపర్ థ్రిల్లర్ గా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ తోనే ఈ మూవీపై ఇంట్రెస్ట్ పెరిగింది. తాజా గా ఫస్ట్ గ్లింప్స్ తో సమంత యశోద పై భారీ గా అంచనాలు నెలకొంటున్నాయి.
Very excited to present to you the first glimpse of our film #Yashoda#Yashoda #YashodaFirstGlimpse @varusarath5 @Iamunnimukundan @dirharishankar @hareeshnarayan #ManiSharma @krishnasivalenk @SrideviMovieOff @PulagamOfficial pic.twitter.com/7QabzACDcL
— Samantha (@Samanthaprabhu2) May 5, 2022