F3 : 1 మిలియన్ కొట్టేసిన ‘ఎఫ్3’..!

వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా మరో గ్లామర్ బ్యూటీ సోనాల్ చౌహాన్ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా తెరకెక్కింది. దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం . మే 27న విడుద‌లై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ బోర్డులతో దూసుకుపోతున్న ఈ చిత్రం యు.ఎస్ లో కూడా దుమ్ము రేపుతుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈరోజుతో అక్కడ $1 మిలియన్ డాలర్లను వసూల్ చేసి రికార్డ్ కొట్టింది ‘ఎఫ్3’.

అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమాల్లో ఇది మూడో చిత్రం అక్కడ 1 మిలియన్ మార్క్ ను అందుకోవడం. పెద్ద సినిమాలకి అయితే అక్కడ $20,$25 టికెట్ రేట్లు ఉంటాయి కాబట్టి వీకెండ్ లోపు $1 మిలియన్ మార్క్ ను అందుకుంటాయి. కానీ ‘ఎఫ్3’ చిత్రం $14 డాలర్లతో కూడా ఆ మార్క్ ను అందుకుని సంచలనం సృష్టించింది. ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని ఇండియన్ కరెన్సీ ప్రకారం అయితే రూ.7 కోట్లకి విక్రయించారు. ఆల్రెడీ రూ.6 కోట్ల వరకు కలెక్ట్ చేసేసినట్టే..! మొదటి వారంతో ఈ మూవీ అక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట పట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు