Sarkarui Vaari Paata : 1 మిలియన్ కొట్టేసిన ‘సర్కారు వారి పాట’..!

మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది.’గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సముద్ర ఖని విలన్ గా నటించాడు. మొదటి షోతోనే ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. కొందరికి ఈ మూవీ నచ్చింది.. కొందరికి నచ్చలేదు అన్నట్టు ఉంది పరిస్థితి. వీకెండ్ తర్వాత ఈ మూవీ పెర్ఫార్మన్స్ ను బట్టి.. సినిమా నిలబడుతుందా లేదా అన్న విషయం పై క్లారిటీ వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బుకింగ్స్ డీసెంట్ గా ఉన్నాయి తప్ప భారీ రేంజ్లో అయితే నమోదు కావడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే బుక్ అయ్యాయి. కానీ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ బాగా డల్ గా ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ఓవర్సీస్ లో మాత్రం ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ ను నమోదు చేస్తుంది. ఆల్రెడీ ఈ మూవీ అక్కడ $1 మిలియన్ కొట్టేసి రికార్డ్ సృష్టించింది. ప్రీమియర్స్ తో $923… గురువారం తెల్లవారుజామున షోలు $136K ని కలెక్ట్ చేయడంతో $1 మిలియన్ కలెక్షన్లను దాటేశాయి. ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని రూ.11 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు మరో $1 మిలియన్ వరకు రాణించాల్సి ఉంది. ఈ మిక్స్డ్ టాక్ తో ఈ మూవీ ఆ ఫీట్ ను సాధిస్తుందో లేదో చూడాలి..!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు