Aha: అల్లువారి వాడకం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . కేవలం రీమేక్ సినిమాతో రికార్డ్స్ కొట్టగల స్టామినా ఆయనది. పవన్ కళ్యాణ్ సినిమా నుంచి లీకెడ్ పిక్ వచ్చిన అది పెద్ద ట్రెండ్ అవుతుంది.వకీల్ సాబ్ సినిమా షూటింగ్ టైం లో ఒక పిక్ లీక్ అయితే అది టైటిల్ లోగో గా మారిపోయింది.

అజ్ఞాతవాసి సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకుని “వకీల్ సాబ్” సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించి పవన్ స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ కి రుచి చూపింది. ఆ సినిమా తరువాత వచ్చినా భీమ్లా నాయక్ కూడా మంచి విజయాన్ని సాధించింది.
ప్రస్తుతం హరి హర వీరమల్లు షూటింగ్ దశలో ఉంది. ఇవి కాకుండా మరి కొన్ని ప్రాజెక్ట్స్ పవన్ చేతిలో ఉన్నాయి.

ప్రస్తుతం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంది మాత్రం ఆహా లో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ ఎపిసోడ్ గురించి. పెద్దగా ఇంటర్వూస్ లో పాల్గొని పవన్ కళ్యాణ్ మొదటి సారి ఒక టాక్ షో కి రావడం విశేషం.
అలానే నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కి మంచి పాపులారిటీ ఉంది. ఇదివరకే రిలీజ్ చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఎపిసోడ్ వలన యాప్ కూడా క్రాష్ అయింది.

- Advertisement -

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేసిన ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. దీనిని ఆహా యాప్ బాగా యూస్ చేసుకుంటుంది అని చెప్పొచ్చు. మొదటి ఈ షో ను ఫిబ్రవరి 3న రిలీజ్ చేస్తాం అని అనౌన్స్ చేసారు. తరువాత ఒక పోస్ట్ పెట్టి దీనిని పదివేలు రీ ట్విట్స్ చేస్తే ఒక రోజు ముందే వదులుతాం అని పోస్ట్ చేసిన క్షణాల్లోనే రీట్వీట్ లా వర్షం కురిసింది. అలానే ఆ యాప్ కి ట్విట్టర్ అకౌంట్ కి కూడా ఆ రీచ్ తోడైంది.

అక్కడితో ఆగకుండా మంచి వీడియో ప్రోమోస్ ను వదులుతూ, అభిమానులను ఆకర్షించే పోస్ట్స్ కూడా పెడుతుంది. పవన్ కళ్యాణ్ ను అల్లు వారు వాడుకునే విధానం చూస్తుంటే కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు అనిపిస్తుంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు