Ajith: “తెగింపు” ఓటిటి డేట్ ఫిక్స్

కోలీవుడ్ హీరోల్లో అజిత్ ది ఓ ప్రత్యేకమైన పంథా. మిగిలిన హీరోలకు భిన్నంగా ప్రయోగాలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తుంటాడు. అజిత్ హీరోగా ఒకే తరహా కథలు పాత్రలకు పరిమితం కావడానికి ఇష్టపడడు. మరోసారి ఈ సిద్ధాంతాన్ని నమ్ముతూ అజిత్ చేసిన తాజా చిత్రం తెగింపు. కాకి ఫేమ్ హెచ్ వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

బ్యాంక్ రాబరీ నేపథ్యంలో రూపొందిన తెగింపు సినిమాలో మంజు వారియర్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న తెలుగుతో పాటు తమిళంతో ఒకేరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

కాగా, ఈ తునివు ఓటీటీ లోకి రాబోతున్నది. ఈ సినిమా ఫిబ్రవరి 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా రిలీజ్ అయింది. థియేటర్లలో విడుదలై నెల రోజులు కాకముందే తునివు ఓటీటీలోకి రాబోతుండటం కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా ఫిబ్రవరి 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -

రిలీజ్ కు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను రికార్డ్ ధరకు నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. యాక్షన్ అంశాలకు సామాజిక సందేశాన్ని మేళవించి దర్శకుడు హెచ్ వినోద్ తునివు సినిమాను తెరకెక్కించాడు. ఇందులో డార్క్ డెవిల్ అనే ఇంటర్నేషనల్ క్రిమినల్ గా అజిత్ నటించాడు. అతడి క్యారెక్టర్జేషన్, యాక్టింగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు భారీగా లాభాలను మిగిల్చింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు