Vishwak Sen : ఓటీటీలో అర్జున కళ్యాణం..!

విశ్వక్ సేన్.. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. వెళ్లి పోమాకే సినిమాతో హీరోగా ఎంట్రి ఇచ్చిన విశ్వక్ సేన్, ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి పేరు సాధించుకున్నాడు. ఫలక్ నుమాదాస్ సినిమాతో తనలో ఉన్న దర్శకున్ని బయటకు తీసి, తన దర్శకత్వ ప్రతిభను చూపించాడు. “హిట్ ఫస్ట్ కేసు” తో విజయాన్ని అందుకున్న విశ్వక్ సేన్ తర్వాత గెలుపు రుచి చూడటానికి చాలా టైం తీసుకున్నాడు.

వరుస అపజయాల తర్వాత చేసిన “అశోకవనంలో అర్జున కల్యాణం” సినిమా ఎన్నో వివాదాల మధ్య ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన వివాదాలో, లేదా.. కథ ఆధారంగానో.. పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. హీరో విశ్వక్‌సేన్‌ ఇప్పటివరకు సీరియస్‌ పాత్రలే ఎక్కువగా చేయగా, తొలి సారి కామెడీని పండించే పాత్రలో నటించాడు.

విశ్వక్ ప్రయత్నం ప్రేక్షకులను కొంత వరకు ఆకట్టుకుందని చెప్పవచ్చు. అందుకే అనుకున్న దానికంటే, కాస్త మెరుగ్గానే కలెక్షన్లు వచ్చాయి. డాక్టర్ స్ట్రేంజ్, సర్కారు వారి పాట, డాన్ సినిమాలు థియేటర్స్ లో అడుగు పెట్టడంతో, విశ్వక్ మూవీ థియేటర్స్ నుండి వెళ్లి పోయింది. కాగ ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు సిద్ధం అయినట్టు తెలుస్తుంది.

- Advertisement -

ఈ నెల 27న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా లో స్ట్రీమింగ్ కానున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. దీనిపై అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. కానీ అతి త్వరలోనే వచ్చే అవకాశముందని సమాచారం. విశ్వక్ సరసన రుక్సార్‌ ధిల్లాన్‌, రితికా నాయక్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విద్యా సాగర్ చింత దర్శకత్వం వహించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు